సమంత సినిమా.. ఊర మాస్

సమంత సినిమా.. ఊర మాస్

ఈ సెప్టెంబరు 13.. సమంతకు మరపు రాని రోజు. ఆమె కెరీర్లో తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యు టర్న్’ ఆ రోజే విడుదల కాబోతోంది. అదే రోజు ఆమెకు చాలా ముఖ్యమైన మరో రెండు సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అందులో ఒకటి సమంత భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’. అనివార్య పరిస్థితుల్లో భార్యాభర్తల సినిమాలు రెండూ ఒకే రోజు రిలీజవుతున్నాయి. తన చిత్రంతో పాటు భర్త సినిమా కూడా బాగా ఆడాలనే సమంత కోరుకుంటూ ఉంటుందనడంలో సందేహం లేదు. విశేషం ఏంటంటే.. ఇదే రోజు సమంత నటించిన తమిళ సినిమా ‘సీమ రాజా’ కూడా రిలీజవుతోంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజవుతోంది. ఇది సామ్ సినిమా ‘యు టర్న్’కు పూర్తి భిన్నంగా ఊర మాస్‌గా ఉంది.

ఇంతకుముందు పల్లెటూరి నేపథ్యంలో ‘రజనీ మురుగన్’ అనే రూరల్ మాస్ సినిమా చేశాడు శివ కార్తికేయన్. అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రాన్ని రూపొందించిన పొన్ రామ్ డైరెక్షన్లోనే శివ ‘సీమ రాజా’ చేశాడు. ఈ మధ్యే వచ్చిన ‘చినబాబు’ తరహాలోనే పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో మాస్ మాస్‌గా సాగేలా కనిపిస్తోందీ సినిమా. ఒక ఊరిలో రాజాలా బతికే కుర్రాడు.. తనకు ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమించాడన్నది ఈ కథ. సమంత ఇందులో టీచర్ పాత్ర చేస్తుండటం విశేషం. ఆమె సినిమా మొత్తం లంగా వోణీల్లోనే కనిపించనుండటం విశేషం. ట్రైలర్లో సమంతకు మంచి ప్రాధాన్యమే కనిపించింది. ఆమె పాత్ర చాలా వినోదాత్మకంగా ఉన్నట్లుంది. సమంతను చాలా అందంగా చూపించినట్లున్నారు. ఈ పాత్రకు సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు