ఆ పాట కంపోజింగ్.. డైరెక్షన్ ఛాన్సిచ్చింది

ఆ పాట కంపోజింగ్.. డైరెక్షన్ ఛాన్సిచ్చింది

డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయమై.. తర్వాత నటుడిగా మారి.. ఆపై దర్శకుడు కూడా అయ్యాడు ప్రభుదేవా. నృత్య దర్శకులు కూడా డైరెక్టర్లయ్యే ట్రెండుకు శ్రీకారం చుట్టింది అతనే. అతడి బాటలో తర్వాత మరెంతో మంది డ్యాన్స్ మాస్టర్లు  మెగా ఫోన్ పట్టారు. మరి ప్రభుదేవాకు దర్శకుడిగా తొలి అవకాశం ఎలా వచ్చింది.. అతడితో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా తీయాలన్న ఆలోచన నిర్మాత ఎం.ఎస్.రాజుకు ఎలా వచ్చింది.. ఈ విశేషాల్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ప్రభుదేవా.

డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నపుడే తనకు దర్శకత్వం మీద ఆసక్తి పుట్టిందని.. కానీ ఎవరితోనూ తన కోరిక చెప్పలేదని.. అవకాశం ఎలా అడగాలో తెలియక సైలెంటుగా ఉండిపోయానని ప్రభుదేవా చెప్పాడు. ఐతే ‘వర్షం’ సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాట తీస్తున్నపుడు తన కష్టం చూసి ఎం.ఎస్.రాజు చాలా ఇంప్రెస్ అయ్యారన్నాడు. తన పనితనం చూసి నేరుగా తన దగ్గరికి వచ్చి ‘ప్రభూ దర్శకత్వం చేస్తావా’ అని అడిగారని.. ఇదే మంచి అవకాశం అనుకుని ‘చేస్తా సార్’ అని చెప్పేశానని.. వెంటనే మంచి కథ దొరకడంతో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మొదలైందని ప్రభుదేవా తెలిపాడు.

తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది తెలుగు సినీ పరిశ్రమే అని.. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోనని అన్నాడు ప్రభు. మళ్లీ తెలుగులో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఉందని.. అలాగే ఇక్కడ నృత్య దర్శకత్వమూ చేయాలని ఉందని.. కానీ ఎవ్వరూ తనను పిలవడం లేదని నవ్వుతూ చెప్పాడు ప్రభుదేవా. ఒక సినిమాకు అన్నీ కుదిరితేనే పట్టాలెక్కుతుందని.. అలా ఇక్కడ మళ్లీ అన్నీ కుదిరి సినిమా చేస్తానేమో చూడాలని అన్నాడు ప్రభు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు