హ్యాపీ బ‌ర్త్ డే క‌ల్యాణ్ బాబాయ్....బ‌న్నీ!

హ్యాపీ బ‌ర్త్ డే క‌ల్యాణ్ బాబాయ్....బ‌న్నీ!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు 47వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కు ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మెగా ఫ్యామిలీ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. త‌న బాబాయ్ కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ ....పారా గ్లైడింగ్ చేసి విషెస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా...ప‌వ‌న్ కు త‌న‌దైన శైలిలో విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. స‌క‌ల సౌక‌ర్యాలు ఉన్న సుఖ‌వంత‌మైన జీవితాన్ని వ‌దిలేసి....స‌మాజం కోసం పోరాడుతున్న క‌ల్యాణ్ బాబాయ్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ బ‌న్నీ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ప‌వ‌న్ కు ఆయ‌న ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. పారా గ్లైడింగ్ తో చెర్రీ ...వెరైటీగా విషెస్ చెప్ప‌గా...అల్లు అర్జున్ తన బాబాయ్ కి ట్విట్టర్ లో శుభాకాంక్ష‌లు తెలిపాడు. ``హ్యాపీ బ‌ర్త్ డే కళ్యాణ్ బాబాయ్.  విలాస‌వంత‌మైన జీవితం, సౌక‌ర్యాలు ఉన్న‌ప్ప‌టికీ.... మెరుగైన స‌మాజం కోసం మీరు ప‌డుతున్న ఆరాటం, శ్ర‌మ...చేస్తోన్న ప్ర‌య‌త్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీ త్యాగం నాలాంటి లక్షల హృదయాలను గెలుచుకుంది. మీకు మ‌రింత శ‌క్తినివ్వాలని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను." అని బ‌న్నీ ట్వీట్ చేశాడు. గ‌తంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు, బ‌న్నీకి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫంక్ష‌న్ కు ప‌వ‌న్ హాజ‌రై త‌మ మ‌ధ్య విభేదాలు లేవ‌ని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేశారు. ఆ త‌ర్వాత శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ ఫిల్మ్ ఛాంబ‌ర్ కు వెళ్లిన‌పుడు ...ప‌వ‌న్ ను బ‌న్నీ క‌లిసి హ‌గ్ చేసుకున్నాడు. తాజాగా, ఎమోష‌న‌ల్ గా ప‌వ‌న్ కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. దీంతో, మెగా ఫ్యాన్స్ అంద‌రూ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు