మహేష్ బావ.. అనుకున్నట్లే

మహేష్ బావ.. అనుకున్నట్లే

అనుకున్నదే అయింది. మహేష్ బావ సుధీర్ బాబు తన కొత్త సినిమా ‘నన్ను దోచుకుందువటే’ను వాయిదా వేయించేశాడు. సెప్టెంబరు 13న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని నెల ముందే ఫిక్సయ్యాడు. ఆ తేదీకి ముందుగా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్నది అతనే. తర్వాత సమంత సినిమా ‘యు టర్న్’ అదే తేదీకి షెడ్యూల్ అయింది. ఈ రెంటి మధ్యే పోటీ ఉంటుందని అనుకున్నారు.

కానీ ఆగస్టు 31న రావాల్సిన అక్కినేని నాగచైతన్య సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనూహ్యంగా వాయిదా పడి.. తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబరు 13కు ఫిక్సయింది. ఈ పోటీ మధ్య సుధీర్ బాబు సినిమాకు ఇబ్బంది తప్పదు. అందుకే కొంచెం ఆలోచించి.. వినాయక చవితి వీకెండ్‌ ను భార్యాభర్తలకే వదిలేసి.. తన సినిమాను వాయిదా వేసుకున్నాడు సుధీర్ బాబు.
‘నన్ను దోచుకుందువటే’ సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. అప్పటికి మరో సినిమా ఏదీ షెడ్యూల్ అయి లేదు. ప్రస్తుతానికైతే సుధీర్ సినిమా సోలోగా రిలీజవుతుందనే అనుకోవాలి.

సెప్టెంబరు 27న ‘దేవదాస్’.. ‘ఇదం జగత్’ రాబోతున్నాయి. ‘నన్ను దోచుకుందువటే’ సుధీర్ సొంత బేనర్లో తెరకెక్కిన తొలి సినిమా. ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో సుధీర్ చాలా కఠినాత్ముడైన బాస్ పాత్రలో నటిస్తున్నాడు. అతడికి పూర్తి భిన్నమైన ఈజీ గోయింగ్ అమ్మాయి పాత్రలో కథానాయిక నభా నటేష్ కనిపించనుంది. దీని టీజర్ వినోదాత్మకంగా సాగి సినిమాపై మంచి ఇంప్రెషనే కలిగించింది. ‘సమ్మోహనం’తో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు చాన్నాళ్ల తర్వాత ఓ విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నాడు సుధీర్. ఆ సక్సెస్ స్ట్రీక్ ను ‘నన్ను దోచుకుందువటే’ కొనసాగిస్తుందని సుధీర్ ఆశిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు