ఛత్రపతి రీమేక్.. సెట్టవుతుందా బాసూ?

ఛత్రపతి రీమేక్.. సెట్టవుతుందా బాసూ?

దక్షిణాది సినిమాల్ని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. ఈ మధ్య కాలంలో హిందీలో సౌత్ రీమేక్‌లు బాగా పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ‘టెంపర్’ మూవీ రీమేక్ నడుస్తోంది. త్వరలోనే ‘కత్తి’ సినిమా పునర్నిర్మితం కానుంది. ‘గూఢచారి’ కూడా అక్కడికి వెళ్తుందని అంటున్నారు. ఐతే బాలీవుడ్ జనాలు చాలా పాత సినిమాల్ని కూడా రీమేక్ చేస్తుంటారు.

ఐదు పదేళ్ల ముందు వచ్చిన చిత్రాలకు కూడా కొత్తగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్లీ తీస్తుంటారు. అమితాబ్ బచ్చన్ నట వారసుడు అభిషేక్ బచ్చన్ ఇలాగే ఓ పాత సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడు. అతను ఆశపడుతున్న సినిమా ప్రభాస్-రాజమౌళిల బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’.

2005లో విడుదలైన ‘ఛత్రపతి’ ప్రభాస్ కెరీర్లో మైలురాయిలా నిలిచింది. అప్పటికి అదే అతడికి పెద్ద బ్లాక్ బస్టర్. ఈ చిత్రాన్ని వేరే భాషల్లోనూ రీమేక్ చేశారు. హిందీలోకి మాత్రం వెళ్లలేదు. అభిషేక్ ఇప్పుడా చిత్రంపై కన్నేశాడు. ‘‘నేను తరచుగా తెలుగు సినిమాలు చూస్తుంటా. నాకు ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్లూ ఉంటాయి. డ్రామా ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. కామెడీ.. రొమాన్స్ ఇలా అన్నీ సమపాళ్లలో ఉంటాయి. నాకు కనుక అవకాశం వస్తే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటించాలని ఉంది’’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ చెప్పాడు.

మరి అభిషేక్ నేరుగా ఇంత ఇంట్రెస్ట్ చూపించాక.. ఏ బాలీవుడ్ దర్శకుడైనా ఈ రీమేక్ దిశగా అడుగులేస్తాడేమో చూడాలి. కాకపోతే ఇలాంటి మాస్ మసాలా సినిమా చేసేంత ఇమేజ్ అభిషేక్‌కు ఉందా.. అతడికి ఈ సినిమా సూటవుతుందా అన్నదే డౌట్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు