ఆర్జీవీ షాడో డైరెక్షన్‌!

ఆర్జీవీ షాడో డైరెక్షన్‌!

'భైరవ గీత' చిత్రానికి దర్శకుడిగా తన పేరు వేసుకోకుండా కేవలం సమర్పకుడిగా మాత్రమే తన పేరు వేసుకున్న రాంగోపాల్‌వర్మ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి దర్శకుడి పేరు ఎవరిది వేసినా కానీ దీనిని వర్మ సినిమాగానే జనం చూస్తున్నారు... అది వేరే విషయం. అయితే పేరు ఎవరిది వేసినా కానీ దీనికి ఆర్జీవీ షాడో డైరెక్షన్‌ చేసాడని, ఆఫీసర్‌తో తన పేరు బాగా బ్యాడ్‌ అవడంతో ఈ చిత్రానికి వేరే దర్శకుడి పేరు వేస్తున్నాడని, తాను దర్శకుడు కాదని అంటే చిత్రాన్ని చూసే దాంట్లో మార్పు వస్తుందని అతను భావిస్తున్నాడట.

తన సినిమాలని ప్రేక్షకులు చూడకుండానే తిప్పి కొడుతున్నారని, అంచేత దర్శకుడిగా వేరొకరి పేరు వేసి ప్రయత్నిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ ఎవరి పేరు వేసినా కానీ తాను అసోసియేట్‌ అయిన చిత్రాన్ని అతని సినిమాగానే చూస్తారు. ఇందుకు బెజవాడ చిత్రం కంటే బెటర్‌ ఉదాహరణ వుండదు. ఏది ఏమైనా అన్నిట్లోను అతి మోతాదుతో వస్తోన్న ఈ చిత్రం వర్మకున్న బ్యాడ్‌ నేమ్‌ పోగొట్టి మళ్లీ అతని బ్రాండ్‌ని నిలబెడుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు