బాలకృష్ణ కలిసినా ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఒప్పుకోట్లేదు

బాలకృష్ణ కలిసినా ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఒప్పుకోట్లేదు

బాలయ్య, ఎన్టీఆర్‌ల మధ్య వున్న దూరం ఎట్టకేలకు తొలగిపోయిందని, ఇద్దరూ మళ్లీ కలిసి పోయారని నందమూరి వంశాభిమానులు సంబరంగానే వున్నారు. ఈ నేపథ్యంలో అరవింద సమేత ఆడియో రిలీజ్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా వస్తారని, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో జూనియర్‌ అతిథి పాత్ర చేస్తాడనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీని పట్ల తారక్‌ అభిమానులు సంతోషంగా లేరు. ఎన్టీఆర్‌తో విబేధాలు వున్నపుడు అతడిని, అతడి సినిమాలని తొక్కేయడానికి జరిగిన ప్రయత్నాలని వారు గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ సినిమాలని బాయ్‌కాట్‌ చేయాలంటూ జరిగిన ఎస్‌ఎంఎస్‌ క్యాంపైన్‌ని గుర్తు చేసుకుని, బాబాయ్‌-అబ్బాయ్‌ సంబంధాలు మెరుగు పడినా కానీ అది సినిమాయేతర విషయాలకే పరిమితం కావాలని, నచ్చినపుడు నెత్తిన పెట్టుకుని, నచ్చనపుడు కాలితో తొక్కేయాలనే ధోరని సబబు కాదని తారక్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఫాన్స్‌ వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో తారక్‌ నిర్ణయం ఎలా వుంటుందనేది ఆసక్తికరం. చూస్తూ చూస్తూ బాబాయ్‌తో మెరుగుపడిన సంబంధాలని తారక్‌ చెడగొట్టుకోకపోవచ్చు. అసలే ఇంట్లో పెద్దదిక్కు మరణించడంతో తమకి బాలయ్య మోరల్‌ సపోర్ట్‌ అన్ని విషయాల్లోను అవసరమే కనుక అభిమానులు కొందరు నొచ్చుకున్నా కానీ బాబాయ్‌కి అనుగుణంగా తారక్‌ నడుచుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English