కౌశల్‌ ఆర్మీకి బిగ్‌బాస్‌ అల్టిమేటం

కౌశల్‌ ఆర్మీకి బిగ్‌బాస్‌ అల్టిమేటం

షోలో ఎవరు వుండాలో, ఎవరు ఎలిమినేట్‌ అవ్వాలో పక్కా స్ట్రాటజీతో ఓటింగ్‌ చేస్తూ ఇంతవరకు బిగ్‌బాస్‌ సీజన్‌ 2ని తమ ఇష్టానుసారం నడిపిన కౌశల్‌ ఆర్మీపై బిగ్‌బాస్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. ఒక ప్రణాళిక ప్రకారం కౌశల్‌ అసలు నామినేషన్స్‌ తప్పించుకోలేకుండా చేసారు. అంటే ఇకపై పర్‌ఫార్మెన్స్‌తో పని లేకుండా, కెప్టెన్సీ టాస్క్‌కి అర్హతే లేకుండా కౌశల్‌ నామినేట్‌ అవుతాడు. కౌశల్‌ నామినేషన్స్‌లో వున్నపుడు ఆర్మీ డిఫెన్స్‌లో వుంటుంది. ఎవరిని ఎలిమినేట్‌ చేయాలనే దానికంటే కౌశల్‌ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇంతటితో బిగ్‌బాస్‌ ఆట అవలేదు.

ఇకపై కౌశల్‌ని ఎలివేట్‌ చేసేలా స్క్రీన్‌ టైమ్‌ అసలు ఇవ్వబోవడం లేదు. అతను బ్యాడ్‌ అయ్యే అవకాశమున్న ఫుటేజ్‌ని మాత్రమే ప్రసారం చేసి, యాంటీ కౌశల్‌ ఓట్‌ని కాన్సాలిడేట్‌ చేసి, ఫైనల్స్‌కి లెవల్‌ గ్రౌండ్‌ సెట్‌ చేయాలనేది బిగ్‌బాస్‌ వ్యూహం. ఇందులో భాగంగానే కౌశల్‌కి కుడిభుజం అయిన నూతన్‌ నాయుడుని కూడా విచిత్రమైన రీతిలో ఎలిమినేట్‌ చేసారు. పబ్లిక్‌ ఓటింగ్‌లో నెగ్గినా కానీ హౌస్‌మేట్స్‌ అభిప్రాయం తీసుకుని అతడిని బయటకి పంపించారట. ఈ షోని డిసైడ్‌ చేసేది పబ్లిక్కే అన్నట్టు కౌశల్‌ ఆర్మీ వ్యవహరిస్తే, ఈ షోలో ఏమి చూపించాలో, ఎలా ఎవరిని బయటకి పంపాలో తమకి తెలుసనే ధోరణిలో కౌశల్‌ ఆర్మీని డిఫెన్స్‌లో పడేయాలని చూస్తోందని, ఇకపై కౌశల్‌ని తమ వ్యక్తిగత పవర్స్‌ ద్వారా బయటకి పంపే అవకాశం కూడా వుందని తెలిస్తే కౌశల్‌ ఆర్మీ జోరుకి కళ్లెం వేయవచ్చునని భావిస్తున్నారట. అయితే దీని వల్ల షో రెప్యుటేషన్‌ పాడయి, తదుపరి సీజన్లపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.