దేవరకొండ అక్కడా సూపర్ స్టారే

దేవరకొండ అక్కడా సూపర్ స్టారే

బ్యాగ్రౌండ్ లేని హీరోలు స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి, మార్కెట్ పెంచుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. అందుకు అన్నీ కలిసి రావాలి కూడా. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఒక మ్యాజిక్ జరిగిపోయింది. చాలా త్వరగా అతను పెద్ద స్టార్ అయిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అతడికి తిరుగులేని ఇమేజ్ వచ్చింది.

తాజాగా ‘గీత గోవిందం’తో అది మరింత హెచ్చు స్థాయికి చేరింది. ఈ సినిమా విడుదలకు ముందు విజయ్‌ను స్టార్ అన్నవాళ్లు.. ఇప్పుడు రేంజ్ పెంచి సూపర్ స్టార్ అంటున్నారు. హీరోగా మూణ్నాలుగు సినిమాల అనుభవమున్న హీరో నటించిన లో బడ్జెట్ మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్.. రూ.60 కోట్ల షేర్ సాధిస్తే సూపర్ స్టార్ అనక ఏమంటారు? కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా అదరగొట్టేస్తోంది.

ముఖ్యంగా తమిళనాట ‘గీత గోవిందం’ ప్రభంజనం చూసి షాకవ్వాల్సిందే.  ఈ చిత్రం అక్కడ ఏకంగా రూ.5 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగులో బడా బడా హీరోలకు కూడా సాధ్యం కాని ఫీట్ ఇది. అసలు ఏ తెలుగు సినిమా కూడా అక్కడ ఇంత వసూళ్లు రాబట్టలేదు.

‘బాహుబలి: ది కంక్లూజన్’కు తమిళనాట భారీ వసూళ్లు వచ్చాయి కానీ.. అక్కడ నేరుగా తమిళ వెర్షనే రిలీజ్ చేశారు. నేరుగా ఓ తెలుగు సినిమా రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఇప్పటిదాకా జరగలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కూడా తమిళ జనాలు ఇరగబడి చూశారు. ఆ సినిమా రీమేక్ కన్ఫమ్ కావడంతో బాగా ఆడుతుండగానే థియేటర్ల నుంచి తీసేశారు. ఆ సినిమాతో విజయ్ అక్కడి ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాడు.

అది ‘గీత గోవిందం’కు బాగా కలిసొచ్చింది. ‘అర్జున్ రెడ్డి’లా ఇది ఇంటెన్స్ మూవీ ఏమీ కాదు. సాధారణమైన చిత్రమే. అయినప్పటికీ తమిళ జనాలు బాగానే ఎగబడి చూశారు. మంచి వసూళ్లు అందించారు. ఈ క్రేజ్ చూస్తుంటే విజయ్ తమిళంలో నటిస్తున్న ‘నోటా’కు హైప్ మామూలుగా ఉండదని, భారీ ఓపెనింగ్స్ వస్తాయని స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు