వారిద్ద‌రికి బౌన్స‌ర్ గా మారిన హీరో!

వారిద్ద‌రికి బౌన్స‌ర్ గా మారిన హీరో!

నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం వారి కుటుంబాన్నే కాదు.. యావ‌త్ తెలుగువారిని షాక్ కు గురి చేసింది. వ‌రుస రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌డటంపైన ఆవేద‌న వ్య‌క్తమ‌య్యేలా చేసింది. ఇదిలా ఉంటే.. హ‌రికృష్ణ అంతిమ సంస్కారం కోసం ఊరేగింపుగా వ‌చ్చారు. హ‌రికృష్ణ కుమారుడు క‌ల్యాణ్ రామ్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లు తీవ్ర విషాదంలో ఉంటూ ఊరేగింపులో పాల్గొన్నారు.

వారున్న మాన‌సిక ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అన్న‌ద‌మ్ములిద్ద‌రిని చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. దీంతో.. అంతిమ యాత్రలో క‌ల్యాణ్ రామ్‌.. ఎన్టీఆర్ న‌డుస్తున్న వైపు జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఈ తోపులాట‌ను సినీ న‌టులంతా చూస్తూ నిల‌బ‌డిపోయారే కానీ.. ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటివేళ‌.. ఈ ఇద్ద‌రి అన్న‌ద‌మ్ముల కోసం ఒక్క‌రు మాత్ర‌మే బౌన్స‌ర్ లా నిల‌వ‌ట‌మే కాదు.. పూర్తి ర‌క్ష‌ణ‌గా నిలిచారు. అత‌నెవ‌రో కాదు.. సినీ న‌టుడు మంచు మ‌నోజ్. ఎన్టీఆర్ కు మంచి మిత్రుడైన మ‌నోజ్.. జ‌నాన్ని కంట్రోల్ చేస్తూ.. కార్య‌క్ర‌మం పూర్తి అయ్యే వ‌ర‌కూ అండ‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ మ‌నోజ్ ధైర్యానికి.. చొర‌వ‌ను అభినందిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు