అయ్యో.. ‘అల్లుడు’కే ఎందుకిలా?

అయ్యో.. ‘అల్లుడు’కే ఎందుకిలా?

ఈ మధ్య కాలంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాకు వచ్చినన్ని అనుకోని అడ్డంకులు మరే సినిమాకు రాలేదు. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కేరళలో వరదల కారణంగా చిత్ర సంగీత దర్శకుడు గోపీసుందర్ రీ రికార్డింగ్ పూర్తి చేయలేకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. అనేక తర్జన భర్జనల తర్వాత సెప్టెంబరు 13న వినాయక చవితి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నాడు ముహూర్తం చూసుకున్నారు. కానీ ఆ రోజు ఉదయం హరికృష్ణ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరుసటి రోజు కూడా హరికృష్ణ అంత్యక్రియలు ఉండటంతో ట్రైలర్ లాంచ్ చేయలేదు. ఇక చివరికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ట్రైలర్ లాంచ్ ఉంటుందని గురువారం సాయంత్రం ప్రకటించారు. ఈ విషయాన్ని చాలా ఎగ్జైట్మెంట్‌తో ప్రకటించాడు చైతూ. కానీ కొన్ని గంటలకే అనుకోని పరిణామం జరిగింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి.. దర్శకురాలు బి.జయ గుండెపోటుతో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో మళ్లీ విషాదం నెలకొంది.

జయ.. అక్కినేని కుటుంబానికి సన్నిహితురాలు. బి.ఎ.రాజు అయితే నాగార్జునకు చాలా చాలా క్లోజ్. మరి తమ కుటుంబానికి సన్నిహితురాలైన జయ చనిపోయిన నేపథ్యంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ ట్రైలర్ లాంచ్ చేసే ఉత్సాహంలో చైతూ ఉంటాడా అన్నది డౌట్. ట్రైలర్ లాంచ్ సమయానికే జయ అంత్యక్రియలు జరగనున్నాయి. రాజు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ట్రైలర్ లాంచ్ వాయిదా వేయాలని చైతూ అంటాడా.. లేక ఎన్నిసార్లు వాయిదా వేస్తాం అని తన ప్రమేయం లేకుండా యధావిధిగా ట్రైలర్ వదిలేయమంటాడా.. చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు