రావ‌టం ఆల‌స్యం కావొచ్చు.. ఎదురుచూడొద్దు!

రావ‌టం ఆల‌స్యం కావొచ్చు.. ఎదురుచూడొద్దు!

స్నేహానికి హ‌రికృష్ణ ఎంత విలువ ఇచ్చారో ఆయ‌న స్నేహితుడు కృష్ణారావు చెప్పిన మాట నంద‌మూరి అభిమానుల కంట క‌న్నీరు తెప్పిస్తోంది. మ‌రో రోజులో జ‌ర‌గ‌బోయేది ఆయ‌న‌కు తెలీకున్నా..ఆయ‌న మాట‌లో అప్ర‌య‌త్నంగా వ‌చ్చాయా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.  

వ్యాపారంలో తాను తీవ్రంగా న‌ష్ట‌పోయి.. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న త‌న‌ను ఇంటికి పిలిచి ధైర్యం చెప్పార‌ని చెప్పారు. బాధ‌ప‌డ‌కు.. అన్నీ స‌ర్దుకుంటాయ‌న్న భ‌రోసాతో పాటు.. త‌మ ఆహ్వానం హోట‌ల్ ను న‌డిపించుకోవాల‌ని.. క‌ష్టాల‌న్నీ తీరుతాయ‌ని చెప్పి రెండు నెల‌ల క్రితం హోట‌ల్ ను త‌న‌కు ఇచ్చార‌న్నారు.

మంగ‌ళ‌వారం రాత్రి త‌న‌తో మాట్లాడుతూ.. ఊరికి వెళుతున్నాన‌ని.. తిరిగి రావ‌టం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని.. నువ్వు నా కోసం ఎదురుచూడొద్దంటూ చెప్పార‌న్నారు. తెల్లారిన వెంట‌నే త‌న మిత్రుడు ఇక లేర‌న్న వార్త తెలిసింద‌ని వాపోతున్నారు. తాను రావ‌టం ఆల‌స్యం  కాదు.. ఎప్ప‌టికి రాలేనంత దూరానికి వెళ్లిపోయారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు హ‌రికృష్ణ మిత్రుడు కృష్ణారావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు