చాయ్ వెర్సస్ సామ్ కాదు.. చాయ్ విత్ సామ్

చాయ్ వెర్సస్ సామ్ కాదు.. చాయ్ విత్ సామ్

అనుకున్నదే అయింది. అక్కినేని నాగచైతన్య.. అతడి భార్య సమంతల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నాయి. సమంత సినిమా ‘యు టర్న్’ చాలా ముందుగానే సెప్టెంబరు 13వ తేదీని రిలీజ్ డేట్‌గా ఎంచుకోగా.. ఆగస్టు 31న రావాల్సిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనివార్య కారణాలతో వాయిదా పడి అదే తేదీకి విడుదల ఖరారు చేసుకుంది.

భార్యాభర్తల సినిమాలు ఒకే రోజు రిలీజైతే ఇబ్బంది కదా అని అందరూ అనుకున్నారు కానీ.. ఇవి రెండూ డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో అదేమంత సమస్య కాదని చైతూ, సామ్ బాక్సాఫీస్ పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీళ్లిద్దరి పెళ్లి జరగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘చైసామ్’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అయింది. ఈ విషయాన్ని ఒక అభిమాని ప్రస్తావిస్తూ.. ఎప్పుడూ ‘చైసామ్’ అనే వాళ్లం.. ఇప్పుడు ‘చై వెర్సస్ సామ్’ అయిపోయింది అని ట్వీట్ చేశాడు.

దీనిపై సమంత వెంటనే స్పందించింది. హ్యాష్ ట్యాగ్ ‘చై వెర్సస్ సామ్’ కాదని.. ‘చై విత్ సామ్’ అని స్పష్టం చేసింది. అంటే తమ సినిమాలు ఒకేసారి కలిసి రిలీజవుతున్నాయి తప్ప.. ఒకదానికి ఇంకోటి పోటీ కాదన్నది ఆమె ఉద్దేశం. విశేషం ఏంటంటే.. వినాయక చవితికి సమంత సినిమానే ఇంకోటి రిలీజవుతోంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి సామ్ నటించిన ‘సీమ రాజా’ కూడా సెప్టెంబరు 13నే విడదుల కానుంది. ‘యు టర్న్’ తమిళంలోనూ ఒకేసారి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అంటే భర్తతోనే కాక సమంతకు తనతోనే తనకు పోటీ కూడా ఉంది.
ఇంతకుముందు మే నెలలో సమంత సినిమాలు రెండు రెండు రోజుల వ్యవధిలో రిలీజయ్యాయి. ‘మహానటి’తో పాటు ‘ఇరుంబు తిరై’ రెండు రోజుల వ్యవధిలో రిలీజయ్యాయి. రెండూ బాగా ఆడాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటవ్వాలని సామ్ ఆశిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు