జ‌ర‌గొద్ద‌ని వేడుకునే వారికే మ‌ళ్లీ అంత క‌ష్ట‌మా?

జ‌ర‌గొద్ద‌ని వేడుకునే వారికే మ‌ళ్లీ అంత క‌ష్ట‌మా?

ఒక విషాదం చోటు చేసుకున్న‌ప్పుడు దాని గురించి ఎంత త్వ‌ర‌గా మ‌ర్చిపోతే అంత త్వ‌ర‌గా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారు కొంద‌రు. మ‌రికొంద‌రు.. త‌మ‌కు ఎదురైన విషాదం మ‌రెవ‌రికీ ఎదురుకాకూడ‌న్న మాట‌ను త‌ర‌చూ చెబుతారు. నంద‌మూరి కుటుంబం కూడా అంతే. నాలుగేళ్ల క్రితం ఊహించ‌ని రీతిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ త‌న‌యుడు జాన‌కీరాం మ‌ర‌ణించిన వైనం తెలిసిందే.

రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన జాన‌కీరాంను గుర్తు చేసుకుంటూ.. త‌మ కుటుంబంలో జ‌రిగిన విషాదం మ‌రెవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న సందేశాన్ని ఇస్తూ.. వారి సినిమాల్లో ప్ర‌ముఖంగా ప్ర‌చారం చేస్తుంటారు. తాము చేసిన సినిమాల ఆరంభంలో మా కుటుంబంలో జ‌రిగిన విషాదం మ‌రే కుటుంబంలో జ‌ర‌గొద్దు అంటూ జాన‌కీరాం రోడ్డు ప్ర‌మాదాన్ని గుర్తు చేసుకుంటూ.. జాగ్ర‌త్త‌గా ప్ర‌యాణం చేయాల‌ని కోరుకోవ‌టం క‌నిపిస్తుంది.

దుర‌దృష్టవ‌శాత్తు అలా హెచ్చ‌రించే నందమూరి కుటుంబంలోనే తాజా విషాదం చోటు చేసుకోవ‌టం.. హ‌రికృష్ణ ప్రాణాలు విడ‌వ‌టాన్ని నంద‌మూరి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అంద‌రిని జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని కోరుకునే కుటుంబానికే మ‌ళ్లీ ఇంత విషాదం ఎదురుకావ‌టం ఏమిటి భ‌గ‌వంతుడా అంటూ రోదిస్తున్న వారెంద‌రో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు