సామ్రాట్‌తో పెళ్లి.. తేజస్వి మళ్లీ

సామ్రాట్‌తో పెళ్లి.. తేజస్వి మళ్లీ

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో మెరిసిన తేజస్వి మదివాడ.. ఈ ఏడాది ‘బిగ్ బాస్’ రెండో సీజన్లో పార్టిసిపెంట్‌గా వెళ్లి.. చాన్నాళ్ల పాటు హౌస్‌లో కొనసాగింది. ఈ సందర్భంగా తేజస్విలోని కొత్త కొత్త కోణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆమె నేపథ్యమేంటో అందరికీ తెలిసొచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకుల గురించి కూడా వెల్లడైంది. హౌస్‌లో ఆమె మరో క్యారెక్టర్ నటుడు సామ్రాట్‌తో చాలా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది. ఈ షో అయ్యాక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఒకసారి స్పందించిన తేజస్వి తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.

తాను మొదటి నుంచి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డానని.. తనకు అందరితో కలిసి మెలిసి ఉండడమే ఇషమని.. కానీ సామ్రాట్ విషయానికొచ్చేసరికి అతను తనకు ఇంకొంచెం సన్నిహితుడిగా అనిపించాడని తేజస్వి చెప్పింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీతనతో పంచుకోవాలనిపించిందని.. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. హౌస్ నుంచి బయటికొచ్చాక అందరూ సామ్రాట్‌తో పెళ్లెప్పుడు అని అడుగుతున్నారని.. సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నలతో కోపమొచ్చిందని ఆమె వెల్లడించింది. కొంచెం స్నేహంగా ఉంటే ప్రేమా, పెళ్లేనా అన్న తేజస్వి.. తనకు సామ్రాట్ మంచి స్నేహితుడు మాత్రమేనంది. బిగ్ బాస్ -2 మొదటి నుంచి చూసిన వారికి తన గురించి తెలుస్తుందని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు