నర్తనశాల టైటిల్ ముందు అదెందుకు?

నర్తనశాల టైటిల్ ముందు అదెందుకు?

నర్తనశాల.. తెలుగులో ఆల్ టైం క్లాసిక్ సినిమాల్లో ఒకటి. ఈ టైటిల్‌తో ఇప్పుడో కొత్త సినిమా తయారైంది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ముందు కేవలం ‘నర్తనశాల’గా ఉన్న ఈ చిత్ర టైటిల్‌ను తర్వాత ‘@నర్తనశాల’గా మార్చారు. ఈ మార్పును చాలామంది గుర్తించలేదు కూడా. ఐతే ఇలా పేరు ముందు @ అని చేర్చడానికి ఒక కారణం ఉందంటున్నాడు హీరో నాగశౌర్య. పాత ‘నర్తనశాల’ సినిమా ఒక క్లాసిక్ అని.. తర్వాత అదే టైటిల్‌తో కొన్ని సినిమాలు మొదలై.. మధ్యలోనే ఆగిపోయాయని శౌర్య చెప్పాడు. అందులో నందమూరి బాలకృష్ణ తీయాలనుకున్న ‘నర్తనశాల’ కూడా ఉందన్నాడు.

ఈ విషయాన్ని తన తండ్రి గుర్తు చేశారని.. ఆ నెగెటివ్ సెంటిమెంటుకు భయపడి ఏ ఇబ్బంది రాకుండా టైటిల్ ముందు @ చేర్చామని శౌర్య తెలిపాడు. సినిమాలో గే క్యారెక్టర్ ఉంది కాబట్టే దీనికి నర్తనశాల టైటిల్ పెట్టామని.. అంతకుమించి దీనికి పాత క్లాసిక్‌కు ఎలాంటి సంబంధం లేదని శౌర్య చెప్పాడు. సినిమాలో తన పాత్రతో పాటు కథ కూడా కొత్తగా ఉంటుందని.. గే ముద్ర పడ్డ కుర్రాడిని ఇద్దరమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నదే ఈ చిత్రమని శౌర్య తెలిపాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీనివాస్ చక్రవర్తి బాగా తీశాడని... ‘@ నర్తనశాల’ తరువాత ఇండస్ట్రీ లో బిజీ అయిపోతాడని శౌర్య జోస్యం చెప్పాడు. త్వరలో తాను రమణ తేజ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నానని.. దానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. ఇది కాక ఇంకా రెండు చిత్రాలకు కమిట్ అయ్యానని శౌర్య వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English