నితిన్‌ని ముంచేసింది ఆ సినిమాయేనా?

నితిన్‌ని ముంచేసింది ఆ సినిమాయేనా?

నితిన్‌కి వరుసగా మూడు డిజాస్టర్లు రావడంతో తదుపరి రాబోయే చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఛలోతో బాగా నవ్వించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తోన్న నితిన్‌ ఆ చిత్రంతో తిరిగి ట్రాక్‌ మీదకి రావాలని చూస్తున్నాడు. చక్కని గ్రాఫ్‌ మెయింటైన్‌ చేస్తూ వెళుతోన్న నితిన్‌కి అనుకోకుండా 'అ ఆ'లో నటించే అవకాశం వచ్చింది.

త్రివిక్రమ్‌తో పని చేసే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన నితిన్‌కి ఆ చిత్రంతో కెరియర్లోనే అతి పెద్ద విజయం దక్కింది. ఇంతవరకు బాగానే వుంది కానీ ఆ తర్వాత నితిన్‌కి ఏమి చేయాలనేది పాలుపోలేదు. మార్కెట్‌ పెంచుకోవాలా, లేక మునుపటిలానే కొనసాగాలా అనే మీమాంసకి లోనయ్యాడు. దీంతో చాలా టైమ్‌ తీసుకుని లై చిత్రాన్ని ఓకే చేసాడు. పెరిగిన తన మార్కెట్‌ని నిలబెట్టే సినిమా అని నమ్మాడు. కానీ అది బోల్తా కొట్టింది. దాంతో మళ్లీ త్రివిక్రమ్‌నే నమ్ముకుని అతను రాసిన కథ అని ఛల్‌ మోహన్‌ రంగ తీసాడు.

ఇది పెద్ద ఫ్లాప్‌ అవడంతో నితిన్‌ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ తర్వాత తనకి కావాల్సిన హిట్‌ ఇచ్చేస్తాడని బ్లయిండ్‌గా దిల్‌ రాజుని నమ్మి శ్రీనివాస కళ్యాణంతో మరో దెబ్బ తిన్నాడు. ఎవరికైనా హిట్టు సినిమాతో కెరియర్‌ ట్రాక్‌లో పడుతుంది. కానీ నితిన్‌కి అఆతో కన్‌ఫ్యూజన్‌ పెరిగి కథ మళ్లీ మొదటికి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు