కౌషల్‌ ఆర్మీకి బిస్కెట్లు

కౌషల్‌ ఆర్మీకి బిస్కెట్లు

బిగ్‌బాస్‌ షోతో పరిచయం లేని వారికి ఈ కౌషల్‌ ఆర్మీ ఏమిటనేది ఐడియా వుండదు కానీ ప్రస్తుతం నడుస్తోన్న సీజన్‌ చూసేవారికి మాత్రం ఈ పేరు బాగా ఎరుకే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒంటరి పోరు సాగిస్తున్నాడని అతడికి ఓట్లు వేయడానికి బయట అతని అభిమానులంతా ఆర్మీగా ఫార్మ్‌ అయ్యారు. కౌషల్‌ని కష్టపెట్టే కంటెస్టెంట్లని షోలో నుంచి పంపించేసి, కౌషల్‌ నామినేషన్లలో వున్నపుడు కోట్ల కొద్దీ ఓట్లు వేస్తూ అతడు బయటకి పోకుండా కాపాడుకుంటున్నారు.

మొదట్లో పిల్లలాటలా మొదలైనదే అయినా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే ట్రెండింగ్‌ టాపిక్‌. వాళ్లు తలచుకున్న ఏ పాయింట్‌ని అయినా నేషనల్‌ లెవల్లో నిమిషాల మీద ట్రెండ్‌ చేయించేస్తోన్న కౌషల్‌ ఆర్మీ ఇప్పుడు సినిమా వాళ్ల దృష్టిలోను పడింది. పబ్లిసిటీకి హెల్ప్‌ అవుతుందని భావిస్తే ఏ దారిని వదులుకోని సినిమా వాళ్లు పనిలో పనిగా కౌషల్‌ ఆర్మీకి కూడా బిస్కెట్లు వేస్తున్నారు. నీవెవరో చిత్ర నిర్మాత కోన వెంకట్‌ అయితే కౌషల్‌ ఆర్మీ మాత్రం మా సినిమా చూస్తే బ్లాక్‌బస్టర్‌ అయిపోతుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

తాజాగా దర్శకుడు మారుతి కూడా కౌషల్‌ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేసాడు. త్వరలో అతని సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' విడుదల కానుంది కనుక ఇలా కౌషల్‌ ఆర్మీని మచ్చిక చేసుకుంటున్నాడనే కామెంట్లు పడుతున్నాయి. షో ముగిసిన తర్వాత ఈ ఆర్మీ జాడ కనిపిస్తుందనేది అనుమానమే అయినా ప్రస్తుతానికి మాత్రం సోషల్‌ మీడియాలో ఈ ఆర్మీ హల్‌చల్‌ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English