'గీత గోవిందం' సీన్‌ అయితే లేదు

'గీత గోవిందం' సీన్‌ అయితే లేదు

'ఛలో' తర్వాత నాగశౌర్య నిర్మించిన 'నర్తనశాల' చిత్రంపై ఆసక్తి అయితే బాగానే వుంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా చూసేయాలని ఎదురు చూసేవాళ్లే ఎక్కువ వున్నట్టు లేరు. ఈ చిత్రానికి 'గీత గోవిందం' మాదిరిగా రెస్పాన్స్‌ వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. కానీ ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ చూస్తే అందుకు దరిదాపుల్లో కూడా నర్తనశాల లేదు.

గీత గోవిందం టికెట్లు పెట్టినవి పెట్టినట్టుగా ఆన్‌లైన్‌లో సేల్‌ అయిపోయేవి. స్టార్‌ హీరోల సినిమాలతో సమానంగా టికెట్ల కోసం రికమండేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 'నర్తనశాల'కి కనీసం 'ఛలో' మాదిరి క్రేజ్‌ కూడా వున్నట్టు అనిపించడం లేదు. ఈ చిత్రంపై అపారమైన నమ్మకంతో తన మార్కెట్‌ కంటే రెండింతలు ఖర్చు పెట్టేసాడు నాగ శౌర్య. ఏ సినిమాకి అయినా విడుదలకి ముందే చూసి తీరాలన్న కాంక్ష కలిగించాల్సిన ట్రెండ్‌ నడుస్తోందిపుడు.

ప్రస్తుత అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌ని బట్టి నర్తనశాలకి అది కనిపించడం లేదు. రేపు సినిమా రిలీజ్‌ అయి బ్రహ్మాండంగా వుందనే టాక్‌ వస్తే మాత్రం సాయంత్రానికే పుంజుకునే అవకాశాలైతే లేకపోలేదు. గీత గోవిందంతో సినీ వినోద ప్రియుల తృష్ణ బాగా తీరిపోయిన వేళ వస్తోన్న నర్తనశాల మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్ల వైపు నడిపించాలంటే బ్లాక్‌బస్టర్‌ రిపోర్ట్స్‌ తెచ్చుకుని తీరాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు