పవన్‌ ఫాన్స్‌లో ఆ జోష్‌ ఏదీ?

పవన్‌ ఫాన్స్‌లో ఆ జోష్‌ ఏదీ?

సినిమాల నుంచి రాజకీయాల వైపు వెళ్లిన పవన్‌కళ్యాణ్‌ పట్ల అభిమానులకి ఆసక్తి సన్నగిల్లుతోందా? అవుననే అనిపిస్తోంది సోషల్‌ మీడియా ట్రెండ్‌ చూస్తోంటే. హీరోగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా కానీ ఫాన్స్‌ ఎప్పుడూ పవన్‌పై ఆశలు వదులుకోలేదు. నంబర్‌వన్‌ అంటే పవన్‌ అనేట్టుగా ఎప్పుడూ అతనికి వెన్నంటి నిలిచారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారుతోంది. సినిమాలకి విరామం ఇచ్చి రాజకీయాలతో బిజీ అయిన పవన్‌ ఇంతవరకు 'జనసేన' అధినేతగా చెప్పుకోతగ్గ ప్రభావం చూపించలేదు.

జనంలోకి వెళతానని, జనం కోసం పోరాడతానని చెప్పిన పవన్‌ అక్కడ కూడా సినిమా రంగంలో చూపించినట్టుగా బద్ధకం చూపిస్తున్నాడు. కేవలం ఒక గ్రూపుకి పరిమితం అయిపోతూ ఇంతవరకు పార్టీకి ఒక బేస్‌ కూడా సెట్‌ చేయలేకపోయాడు. పవన్‌ తీరు చూసిన వీరాభిమానులు కూడా విసిగిపోయారు. రాజకీయ పరంగా పవన్‌ చేసేదేమీ వుండదని చాలా మంది రియలైజ్‌ అయిపోయారు. వారిలోని నిరుత్సాహం, నిరాశ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

 పవన్‌ బర్త్‌డే వస్తోందంటే వంద రోజుల ముందు నుంచీ సందడి మొదలు పెట్టే అభిమానులు ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో పవన్‌ బర్త్‌డే వుందన్నా ఎక్కువ ఆసక్తిగా లేరు. ఒకానొక టైమ్‌లో పవన్‌ పుట్టినరోజుకి పడినన్ని ట్వీట్స్‌ మరే హీరోకీ పడలేదనే రికార్డ్‌ వుండేది. పవన్‌కి వున్న కల్ట్‌ ఫాలోయింగ్‌ మరో హీరోకి లేదనిపించేది. కానీ రాజకీయాల పరంగా పవన్‌ తన అభిమానుల్ని కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడనే దానికి ఇదే నిదర్శనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English