అతనికోసం సమంత 'యు టర్న్‌' తీసుకుంటుందా?

అతనికోసం సమంత 'యు టర్న్‌' తీసుకుంటుందా?

'శైలజారెడ్డి అల్లుడు' రిలీజ్‌ డేట్‌ వినాయకచవితికి మార్చారు. ఆగస్టు 31న రావాల్సిన చిత్రం సెప్టెంబర్‌ 13కి మారేసరికి అప్పటికే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న 'యు టర్న్‌'కి తలనొప్పిగా మారింది. వేరే ఎవరి సినిమా అయినా అయితే ఫర్వాలేదేమో కానీ ఇప్పుడు నాగచైతన్య సినిమానే సమంత చిత్రానికి పోటీగా రావడంతో భార్యాభర్తలకే ఇబ్బందిగా పరిణమించింది.

శైలజారెడ్డి అల్లుడు పెద్ద బడ్జెట్‌ సినిమా కనుక వినాయకచవితి లాంటి పండగ రిలీజ్‌ దానికి అవసరమే. ఒకవేళ సమంత యుటర్న్‌ అదే రోజున వస్తే మాత్రం ఏ సెంటర్స్‌లో, మల్టీప్లెక్సుల్లో శైలజారెడ్డి అల్లుడుకి గండి కొడుతుంది. అందుకే యుటర్న్‌ వాయిదా వేసుకుంటారనే హోప్‌తో శైలజారెడ్డి అల్లుడు టీమ్‌ వుంది. ఈ రిలీజ్‌ డేట్స్‌ వ్యవహారంలో సమంత, చైతన్య అయితే అసలు ఇన్‌వాల్వ్‌ అవడం లేదట.

యుటర్న్‌ చిన్న బడ్జెట్‌ చిత్రమే కనుక ఆ పై వారానికి వాయిదా వేసుకుంటారని శైలజారెడ్డి నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ చవితికి భారాభర్తల యుద్ధాన్ని బాక్సాఫీస్‌ చూస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు