అల్లు అరవింద్ ఎంత వెనకేసుకున్నారు?

అల్లు అరవింద్ ఎంత వెనకేసుకున్నారు?

‘గీత గోవిందం’ సినిమా ప్రభంజనం చూసి టాలీవుడ్ మామలూగా షాకవ్వట్లేదు. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.30-40 కోట్ల మధ్య షేర్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రం ఏకంగా రూ.60 కోట్ల షేర్ మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది. తీరా చూస్తే ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ.10 కోట్లేనట. సినిమా చూస్తేనే ఎంత తక్కువ ఖర్చులో పూర్తి చేశారో అర్థమైపోతుంది. చాలా మామూలు లొకేషన్లలో సింపుల్‌గా సినిమా తీసేశారు. ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్‌కి అనుకున్న పారితోషకం కూడా తక్కువే. రిలీజ్ తర్వాత అదనపు రెమ్యూనరేషన్ ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు కానీ.. సినిమా పూర్తయ్యే సమయానికి మాత్రం ఖర్చు రూ.10 కోట్లకు అటు ఇటుగానే తేలిందట.

ఇక ఔట్ పుట్ చూసి ఇది పెద్ద హిట్ అవుతుందని అంచనా వేసిన అల్లు అరవింద్.. చాలా ఏరియాల్ని తన వద్దే ఉంచుకున్నాడు. కొన్ని ఏరియాలు మాత్రమే అమ్మాడు. వాటితోనూ మంచి లాభాలే వచ్చాయి. సినిమా ఏమో బడ్జెట్ మీద ఆరు రెట్లు కేవలం థియేట్రికల్ షేర్ ద్వారానే రాబడుతోంది. ఈ మార్గంలోనే అరవింద్ రూ.30 కోట్లకు పైగా లాభం అందుకున్నట్లు సమాచారం. ఇక శాటిలైట్.. డిజిటల్.. హిందీడబ్బింగ్ లాంటి మార్గాల ద్వారా ఆయన ఈజీగా రూ.10 కోట్లకు పైగానే ఖాతాలో వేసుకుంటున్నారట. మొత్తంగా కనీస పక్షం రూ.40 కోట్ల లాభం అందుతున్నట్లు సమాచారం. ఒక భారీ చిత్రాన్ని నిర్మించినా కూడా ఈ స్థాయి లాభం వస్తుందన్న గ్యారెంటీ లేదు. టాలీవుడ్లో అత్యధిక లాభాలందించిన సినిమాల్లో కచ్చితంగా ఇది అగ్రభాగాన నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకుముందు ‘గీతా ఆర్ట్స్-2’లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ అరవింద్‌కు అప్పట్లో రూ.20 కోట్లకు పైగా లాభం అందిస్తే.. ‘గీత గోవిందం’ దానికి రెట్టింపు లాభం ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు