చైతూ అయోమయం... సమంత మాత్రం సై

చైతూ అయోమయం... సమంత మాత్రం సై

అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 31నే రావాల్సిన ఈ చిత్రం రీరికార్డింగ్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ డేట్ ఎంచుకోవాలో తెలియక చిత్ర బృందం సతమతమవుతోంది. ముందు సెప్టెంబరు 7వ తేదీపై కన్నేశారు కానీ.. ఆ రోజుకు మూణ్నాలుగు చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉండటంతో అక్కడ సినిమను దించడం అన్యాయం అవుతుందని వెనక్కి తగ్గారు. తర్వాతి వారం చూస్తే చైతూ భార్య సమంత సినిమా ‘యు టర్న్’ షెడ్యూల్ అయి ఉంది. సెప్టెంబరు 27న చైతూ తండ్రి నాగార్జున చిత్రం ‘దేవదాస్’ రాబోతోంది. వీటి మధ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ను ఎప్పుడు దించాలో అర్థం కావడం లేదు.

‘యు టర్న్’తో పోటీ వస్తే వచ్చిందని వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 13నే ఈ చిత్రం రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ డేటే ఫిక్సయినట్లయితే.. ముందు విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్లు మొదులపెట్టేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ విషయంలో తర్జనభర్జనలు నడుస్తూనే ఉన్నట్లున్నాయి. మరోవైపు చైతూ కోసం సమంత త్యాగం చేస్తుందని.. ‘యు టర్న్’ను వారం లేటుగా రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని సమంత సంకేతాలిచ్చింది. తాజాగా ఆమె ట్విట్టర్లో ‘యుటర్న్’ రిలీజ్ డేట్ పోస్టర్లను షేర్ చేసింది. తెలుగు, తమిళ భాష్లలో ఒకేసారి ఈ చిత్రం అదే తేదీకి రిలీజ్ కాబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. మరి సమంత అంత క్లారిటీతో సినిమాను ప్రమోట్ చేసుకుంటుంటే.. చైతూ మాత్రం అయోమయంలో కొట్టుమిట్లాడుతూనే ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు