నయన్ బాక్సాఫీస్ స్టామినా చూశారా?

నయన్ బాక్సాఫీస్ స్టామినా చూశారా?

లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు నయనతారకు 100 పర్సంట్ యాప్ట్ అని మరోసారి రుజువైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కోలమావు కోకిల’ తమిళనాట అదరగొడుతోంది. ఆగస్టు 17న విడుదలైన ఈ చిత్రం 9 రోజుల్లో రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. తమిళనాట లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదో రికార్డు. గత రికార్డు కూడా నయనతారదే. తన రికార్డును తానే అధిగమించింది. అత్యంత వేగంగా రూ.20 కోట్ల మార్కును అందుకున్న లేడీ ఓరియెంటెడ్ తమిళ సినిమాగా ‘కోలమావు కోకిల’ రికార్డు నెలకొల్పింది.

మామూలుగా పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే తమిళనాట తెల్లవారుజామున, ఉదయం ముందస్తు షోలు వేస్తుంటారు. అలాంటిది ‘కోలమావు కోకిల’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఉదయం 6 గంటలకే షోలు పడటం సంచలనం రేపింది. నయన్ రేంజ్ ఏంటో అప్పుడే అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు 9 రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కునూ టచ్ చేసింది. ఫుల్ రన్లో రూ.30 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17నే తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదర్లేదు. ఇంతకుముందు నయన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ‘మయూరి’.. ‘కర్తవ్యం’ తెలుగులోనూ మంచి ఫలితాన్నందుకున్నాయి. ‘కోకో కోకిల’ కూడా అదే బాటలో నడుస్తుందని అంచనా వేస్తున్నారు. దిలీప్ నెల్సన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రాన్ని ‘2.0’ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ ప్రొడ్యూస్ చేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు