మహేష్ సినిమా అక్కడైనా ఆడుతుందా?

మహేష్ సినిమా అక్కడైనా ఆడుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ‘స్పైడర్’ గురించి అంచనా వేశారంతా. దర్శకుడిగా తిరుగులేని ట్రాక్ రికార్డున్న మురుగదాస్‌కు మహేష్ జత కలిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుందని అనుకున్నారు. కానీ ‘స్పైడర్’ ఈ అంచనాల్ని అందుకోడంలో ఘోరంగా విఫలమైంది. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవుతుందని అనుకుంటే.. అతి పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. ఈ చిత్రాన్ని టీవీలో ప్రిమియర్‌గా వేస్తే అక్కడా ఘోరమైన ఫలితం వచ్చింది. మహేష్ సినిమాల్లో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇప్పుడు ‘స్పైడర్’ డిజిటల్ ఫ్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధమైంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రఖ్యాత డిజిటల్ మూవీ ఫ్లాట్ ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ రిలీజ్ చేస్తోంది.

నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేస్తున్న తొలి తెలుగు సినిమాగా ‘స్పైడర్’ రికార్డు సృష్టించబోతుండటం విశేషం. తెలుగు నుంచి తొలి సినిమాగా ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్‌ను నెట్ ఫ్లిక్స్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మహేష్ అభిమానులు మాత్రం దీన్నో రికార్డుగా చూస్తున్నారు. ఇది మహేష్‌కు దక్కిన గౌరవంగా పేర్కొంటున్నారు. మరి థియేటర్లలో.. టీవీల్లో డిజాస్టర్ అయిన ‘స్పైడర్’ నెట్ ఫ్లిక్స్‌లో అయినా మంచి స్పందన తెచ్చుకుంటుందో లేదో చూడాలి. అయినా రిలీజైన కొత్తలో టీవీల్లో వేస్తేనే జనాలు అంతగా చూడలేదు. అలాంటిది విడుదలైన పది నెలల తర్వాత డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి వస్తే ఏమాత్రం ఆదరిస్తారన్నది డౌటు. విశేషం ఏంటంటే.. ‘స్పైడర్’ తర్వాత ఈ వేసవిలో వచ్చిన మహేష్ హిట్ మూవీ ‘భరత్ అనే నేను’ ఆల్రెడీ అమేజాన్ ప్రైంలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు