శిరీష్ చేస్తే ఎన్ని కోట్లొచ్చేవి?

శిరీష్ చేస్తే ఎన్ని కోట్లొచ్చేవి?

‘గీత గోవిందం’ హిట్టవుతుందని అనుకున్నారు కానీ.. మరీ ఇంత పెద్ద రేంజి విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీని కంటే ముందు దర్శకుడు పరశురామ్ గీతా ఆర్ట్స్ బేనర్లో తొలిసారిగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా చేశాడు. అది మంచి సినిమానే. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా కమర్షియల్ గా మరీ పెద్ద సక్సెస్ మాత్రం కాలేదు.

ఐతే ‘సారొచ్చారు’ లాంటి డిజాస్టర్ తర్వాత తనకు ‘గీతా ఆర్ట్స్’ లాంటి పెద్ద బేనర్లో అవకాశం దక్కడమే పెద్ద విషయంగా భావించాడు పరశురామ్.  ఈ రుణం తీర్చుకుంటూ శిరీష్ కు హీరోగా తొలి విజయాన్నందించాడు. నిజానికి ‘గీత గోవిందం’ కథను కూడా పరశురామ్ శిరీష్ తోనే చేయాల్సిందట. అల్లు అరవింద్ ముందు తన కొడుకుతోనే ఈ సినిమా చేయమని అన్నాడట. కానీ పరశురామ్ మాత్రం విజయ్ దేవరకొండ వైపు మొగ్గు చూపాడట.

ఐతే ‘గీత గోవిందం’ సాధించిన సక్సెస్ చూశాక అల్లు శిరీష్ తాను ఈ సినిమా చేయకపోవడం పట్ల చింతిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఒకవేళ శిరీష్ ఈ సినిమా చేస్తే ఇది ఇలా ఆడేదా.. ఈ స్థాయి విజయం సాధించేదా అన్నది డౌట్. ‘గీత గోవిందం’ నిజానికి మామూలు సినిమానే. అందులో కథాకథనాలు అంత గొప్పగా ఏమీ ఉండవు. జస్ట్ అది ఒక టైంపాస్ ఎంటర్టైనర్. దీనికి ప్రధాన ఆకర్షణ విజయ్ దేవరకొండనే. అతడి విలక్షణ నటనే గోవింద్ పాత్రకు పెద్ద బలమైంది. అతడి మార్కు వినోదమే సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్‌కి వచ్చిన క్రేజ్ దీనికి బాగా కలిసొచ్చింది.

విజయ్ స్థానంలో ఇంకే యంగ్ హీరో ఉన్నా ఈ సినిమా ఇలా ఆడేది కాదన్నది స్పష్టం. అసలు ఎవరైనా స్టార్ హీరో చేసినా ఇది వర్కవుట్ అయ్యేది కాదేమో. ఇక శిరీష్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సినిమా బాగుంటే శిరీష్‌కు ప్రయోజనం కలుగుతోంది కానీ.. అతడి వల్ల సినిమాకు అడ్వాంటేజ్ వచ్చే స్థాయికి అతనింకా చేరలేదు. ‘గీత గోవిందం’లో అతను చేస్తే పెట్టుబడి మాత్రమే వెనక్కి వచ్చేదేమో కానీ.. అల్లు అరవింద్ ఇప్పట్లా పెట్టుబడిపై నాలుగైదు రెట్లు లాభాలందుకునేవాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు