పవన్‌ పుట్టినరోజుకి చరణ్‌ గిఫ్ట్‌

పవన్‌ పుట్టినరోజుకి చరణ్‌ గిఫ్ట్‌

చిరంజీవి బర్త్‌డేకి రామ్‌ చరణ్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ చిరు బర్త్‌డేని పూర్తిగా 'సైరా'కే పరిమితం చేసాడు చరణ్‌. ఆ సినిమా లైమ్‌లైట్‌ని స్టీల్‌ చేయడానికి చరణ్‌ ఇష్టపడలేదు. అయితే ఎప్పుడో వచ్చే సైరాకి హడావిడి చేసి చరణ్‌ చిత్రాన్ని సైడ్‌కి వేయడం అభిమానులకి రుచించలేదు.

చిరు బర్త్‌డేకి ఇవ్వని ఆ గిఫ్ట్‌ పవన్‌ బర్త్‌డేకి ఇవ్వాలని చరణ్‌ భావిస్తున్నట్టు వినిపిస్తోంది. పవన్‌ సినిమాల నుంచి విరామం తీసుకోవడంతో అభిమానులకి ఈసారి అతని సినిమా విశేషాలేమీ లేకుండా పోయాయి. అందుకే బాబాయ్‌ బర్త్‌డేకి ఆ వెలితిని కాస్తయినా తగ్గించాలని చరణ్‌ తన సినిమా ఫస్ట్‌ లుక్‌ సెప్టెంబర్‌ 2న విడుదల చేయాలని చూస్తున్నాడని చెబుతున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా వుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ధృవ, రంగస్థలం తర్వాత చరణ్‌ చేస్తోన్న చిత్రం కావడంతో ఇది కూడా ప్రత్యేకంగా వుంటుందా లేక బోయపాటి స్టయిల్లో వుంటుందా అని ఫాన్స్‌లో ఉత్కంఠ వుంది. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తే సినిమాపై ఒక అంచనాకి రావచ్చుననేది అభిమానుల ఫీలింగ్‌. పవన్‌ బర్త్‌డేకి మరి చరణ్‌ మిస్‌ కాకుండా మెగా ఫాన్స్‌కి గిఫ్ట్‌ ఇచ్చేసాడేమో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు