కౌషల్‌ దొరుకుతాడని బిగ్‌బాస్‌ వెయిటింగా?

కౌషల్‌ దొరుకుతాడని బిగ్‌బాస్‌ వెయిటింగా?

మరో నాలుగు వారాల్లో సీజన్‌ ముగియనుంటే ఇంకా బిగ్‌బాస్‌ హౌస్‌లో పదిమంది కంటెస్టెంట్లు మిగిలారు. ఫైనల్‌ వీక్‌కి అయిదుగురు వుండాలనేది ముందే ఫిక్స్‌ అయింది. కానీ ఇంకా పదిమందిని హౌస్‌లో వుంచడం వెనక ఆంతర్యమేంటనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

ఈ షో మూడవ వారంలోనే ట్రాక్‌ తప్పింది. కౌషల్‌ని పలువురు కంటెస్టెంట్స్‌ కలిసి కార్నర్‌ చేయడంతో ఆడియన్స్‌ అతడితో ఎమోషనల్‌గా కనక్ట్‌ అయ్యారు. అప్పట్నుంచీ ఎవరు ఎలా ఆడారనే దానికంటే కౌషల్‌ని ఎవరు ఎక్కువ టార్గెట్‌ చేసారనేదే ఎలిమినేషన్‌కి కారణమవుతూ వచ్చింది. హౌస్‌లో ఏమీ చేయని గణేష్‌, అమిత్‌లాంటి వాళ్లు ఇంకా కొనసాగుతూ వుండగా, తలలో నాలుకలా వుండే కంటెస్టెంట్లు బయటకి వచ్చేసారు.

ఇప్పటికీ కంటెస్టెంట్స్‌ని తగ్గించకుండా బిగ్‌బాస్‌ ఎందుకు నానుస్తున్నట్టు? డబుల్‌ ఎలిమినేషన్లు పెడితే హౌస్‌లో మిగిలిన బలమైన కంటెస్టెంట్స్‌ బయటకి పోయి ఫైనల్‌ పూర్తిగా వన్‌ సైడ్‌ అయిపోతుందని బిగ్‌బాస్‌ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతోందని ఇన్‌సైడర్లు చెబుతున్నారు.

కౌషల్‌ ఏదో విషయంలో దొరికేసి తన పాపులారిటీ తగ్గితే అప్పుడు గేమ్‌ బ్యాలెన్స్‌ అవుతుందని, లేదంటే పూర్తిగా ప్రిడిక్టబుల్‌ అయిపోయి ఫైనల్‌లో ఉత్కంఠ పోతుందని ఇలా చేస్తున్నారట. అయితే వచ్చే రెండు వారాల్లో అయిదుగురిని బయటకి పంపించాల్సిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కౌషల్‌ పాపులారిటీని ఎలా తగ్గిస్తారనేది ఆసక్తిదాయకమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు