బాక్సాఫీస్‌ బంగారుకొండ

బాక్సాఫీస్‌ బంగారుకొండ

విజయ్‌ దేవరకొండ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి బంగారుకొండలా అవతరించాడు. అర్జున్‌రెడ్డితో అతనికి దక్కిన విజయాన్ని ఎక్కువమంది సీరియస్‌గా తీసుకోలేదు. ట్రెయిలర్‌ నచ్చడం వల్ల యువత ఎగబడి చూసేసారని, కంటెంట్‌ రొటీన్‌కి భిన్నంగా వుండడం అతనికి కలిసి వచ్చిందని అనుకున్నారు. కానీ 'గీత గోవిందం'తో విజయ్‌ అసలు రేంజ్‌ ఏమిటో తెలిసింది.

యువత అతడిని ఎంత పిచ్చిగా ఆరాధిస్తున్నారో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో అతనికి ఎంత గుర్తింపు వచ్చిందో రుజువైంది. యుఎస్‌లో రెండు మిలియన్లకి పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా చూస్తే విజయ్‌ గొప్పతనం తెలుస్తుంది. ప్రతి సినిమాలోను ఒక పెద్ద స్టార్‌ లేదా పెద్ద డైరెక్టర్‌ ఖచ్చితంగా వున్నారు. 'ఎక్స్‌ ఫ్యాక్టర్‌' వున్న మహానటి చిత్రం దీనికి మినహాయింపు.

సావిత్రి కథ తెలుసుకోవాలనే కుతూహలానికి తోడు, నాలుగు స్టార్ల రేటింగులు తెచ్చుకున్న సినిమా కావడంతో మహానటి ఆ స్థాయిలో సక్సెస్‌ అయింది. ఒక సాధారణ ఎంటర్‌టైనర్‌తో, ఎలాంటి ఎక్స్‌ట్రా హంగులు లేకుండా గీత గోవిందం టాప్‌ 10లో నిలవడం ప్యూర్‌ విజయ్‌ దేవరకొండ స్టామినానే అనాలి. ఇరవై కోట్ల లోపు బడ్జెట్‌లో రూపొందిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన 'గీత గోవిందం' విజయ్‌ని సూపర్‌స్టార్‌ని చేసింది.

ఇకపై అతని సినిమాలని కొనడానికి బయ్యర్లు వెనకా ముందు ఆలోచించరనే ట్రేడ్‌ భావిస్తోంది. విజయ్‌ కూడా ఈ స్టార్‌డమ్‌ తలకెక్కించుకోకుండా తనని సక్సెస్‌ చేసిన ఫ్యాక్టర్స్‌ని విడిచి పెట్టకుండా కృషి చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు