‘దేవదాస్’లో ఆయన ప్రత్యేక పాత్ర

‘దేవదాస్’లో ఆయన ప్రత్యేక పాత్ర

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన ఎన్నో ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. ‘ప్రేమికుడు’.. ‘పెళ్లి చేసుకుందాం’ లాంటి సినిమాల్లో ఆయన నటనను అంత సులువుగా మార్చలేం. ఐతే ఒకప్పుడు తరచుగా సినిమాలు చేసిన బాలు.. ఈ మధ్య నటుడిగా కనుమరుగైపోయారు. తనే ప్రధాన పాత్ర పోషించిన ‘మిథునం’ తర్వాత ఆయన తెలుగులో దాదాపుగా నటించలేదు. ఐతే చాలా కాలం తర్వాత బాలు ఒక తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారట. ఆ సినిమా మరేదో కాదు.. అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న ‘దేవదాస్’. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలు ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈ సినిమాలో నటించడానికి కారణాలేంటో కూడా ఆయన వివరించారు.

‘‘నేను ఎప్పుడూ ప్రొఫెషనల్ యాక్టర్ కాదు. ఐతే తొలిసారి నన్ను తెరపై చూపిన వాళ్లు.. నటనలో నా ప్రతిభను గుర్తించి ప్రత్యేకమైన పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఐతే ఇప్పటికీ ఏడాదిలో ముగ్గురు నలుగురు దర్శకులైనా నటించమని అడుగుతుంటాు. కానీ చాలా రొటీన్ పాత్రలే నా దగ్గరికి వస్తుండటంతో చేయట్లేదు. ఒక్క సీన్ చేసినా.. ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటా.  మూసలో ఉన్నవి నచ్చవు. ఐతే ‘దేవదాస్’ చిన్నదే అయినా మంచి పాత్ర ఇచ్చారు. అందులో నేను మెడికల్ యూనివర్శిటీ డీన్ పాత్రలో నటించాను. అవయవ దానానికి సంబంధించి ఇందులో మంచి విషయాలు చెప్పారు. అందుకే చేశాను. బాలు ఒక్క సీన్ చేసినా భలే చేశారే అనిపించాలి. అలాంటి పాత్రలతో ఎవరు వచ్చినా నటిస్తాను’’  అని బాలు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు