‘పేపర్ బాయ్’కి మామూలు బూస్ట్ కాదు

‘పేపర్ బాయ్’కి మామూలు బూస్ట్ కాదు

ఈ నెల 31న రాబోతున్న చిన్న సినిమా ‘పేపర్ బాయ్’కి పెద్ద అండే లభించింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ చేజిక్కించుకుంది. తమ బేనర్లో సినిమాను రిలీజ్ చేయబోతోంది. గీతా ఆర్ట్స్-2 బేనర్ ద్వారా కొన్నేళ్లుగా చిన్న, మీడియం రేంజి సినిమాలు నిర్మిస్తున్నారు అరవింద్.

ఐతే కథ నచ్చితే తమ బేనర్లో సినిమా తీయడమే తప్ప.. వేరే వాళ్లు తీసిన సినిమాను టేకప్ చేయడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఇలాంటి వాటికి సురేష్ ప్రొడక్షన్స్ కేంద్రంగా మారింది. ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’ లాంటి సినిమాల్ని ఇలాగే రిలీజ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్.. ఇప్పుడు ‘కేరాఫ్ కంచెర్ల పాలెం’ను టేకప్ చేసింది. గీతా ఆర్ట్స్-2 కూడా ఇదే బాటలో నడిచి ‘పేపర్ బాయ్’ హక్కుల్ని తీసుకుంది.

దర్శకుడు సంపత్ నంది తనే స్క్రిప్టు సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో జయశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. ఐతే అంతా బాగున్నప్పటికీ ఇలాంటి చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షిస్తుంది.. వాళ్లను ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందన్న సందేహాలున్నాయి.

ఇలాంటి టైంలో అల్లు అరవింద్ సినిమాను మెచ్చి తన బేనర్లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారంటే దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం. అలాగే బిజినెస్.. రిలీజ్ విషయంలోనూ సంపత్ నందికి టెన్షన్ లేకపోయింది. ముందే టేబుల్ ప్రాఫిట్‌కి సినిమాను అమ్మేశారు. పైగా గీతా ఆర్ట్స్ సినిమా అంటే థియేటర్లకు ఇబ్బంది ఉండదు. మరి అరవింద్ మెచ్చిన సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English