చిన్మయి ప్రేమలో అలా పడిపోయాడు

చిన్మయి ప్రేమలో అలా పడిపోయాడు

సినీ రంగంలో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకుంటే జనాల దృష్టీ ఎప్పుడూ వాళ్ల మీద ఉంటుంది. వాళ్ల సంగతులు వినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. వాళ్ల ప్రేమాయణం.. పెళ్లి ముచ్చట్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు.

డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించిన చిన్మయి.. ‘అందాల రాక్షసి’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసిన ఇప్పుడు ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్‌ల లవ్ స్టోరీ మీదా జనాల్లో ఆసక్తి ఉంది. ఆ కథేంటో ఒక ఇంటర్వ్యూలో వివరించి చెప్పాడు రాహుల్. ఆ విశేషాలేంటో అతడి మాటల్లోనే..

‘‘నేను హీరోగా నటించిన అందాల రాక్షసి సినిమాలో కథానాయిక పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమా స్క్రీనింగ్ కోసం వెళ్లినపుడు చెన్నైలో ఆమెను కలిశాను. తొలి పరిచయంలోనే ఫ్రెండ్స్ అయ్యాం. మా ఇద్దరికీ కొన్ని కామన్ పాయింట్లున్నాయి. పాలిటిక్స్, ఎకనామిక్స్, సైన్స్, మైథాలజీ.. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడుకుంటాం. తనతో స్నేహం పెరిగాక మా డిస్కషన్లు ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి. ఒక్కో టాపిక్ మీద ఫోన్లో మూణ్నాలుగు గంటలు మాట్లాడుకునే స్థాయికి చేరాం. హోదాను బట్టి కాకుండా అందరితోనూ చిన్మయి చాలా స్నేహంగా మాట్లాడటం నాకు చాలా నచ్చుతుంది. తనకో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సొంతంగా ఆలోచిస్తుంది. మానసిక బలం, సామాజిక అవగాహన ఉన్నాయి. ఇలా నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉండటంతో ఆమెను ప్రేమించాను. తనకు నేనే ప్రపోజ్ చేశాను. ఓకే అన్నాక రెండేళ్లకు పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతోంది’’ అని రాహుల్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు