పెళ్లేమో కానీ.. ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు

పెళ్లేమో కానీ.. ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు

బాలీవుడ్లో ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో రణబీర్ కపూర్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి అతడికి ఎవరో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో దీపికా పదుకొనేతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణబీర్.. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక విదేశీ భామతో అతడికి ముడిపెడుతూ వార్తలొచ్చాయి. ఇవన్నీ అయ్యాక చివరగా ఆలియా భట్ దగ్గర రణబీర్ ఆగాడని అంటున్నారు. కొంత కాలంగా వీళ్లిద్దరూ చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబాలకు కూడా వీళ్ల పెళ్లి ఇష్టమే అంటున్నారు.

రణబీర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంజు’ సక్సెస్ పార్టీలో ఆలియా కనిపించడం ఈ సందేహాలకు బలం చేకూర్చింది. ఆలియాతో ప్రేమాయణం గురించి రణబీర్ కూడా ఏమీ దాపరికం పాటించడం లేదు.

ఆలియాతో తాను ట్రావెల్ అవుతున్న విషయం నిజమే అన్నాడు రణబీర్. ఈ విషయంలో తాను దాగుడుమూతలు ఆడాలని అనుకోవట్లేదని చెప్పాడు. ఆలియాతో తన బంధం మొగ్గ దశలోనే ఉందని అతను అన్నాడు. కానీ ఆలియాకు.. తనకు పెళ్లి చేయడానికి పెద్దలు సన్నాహాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని రణబీర్ స్పష్టం చేశాడు. తనకు 35 ఏళ్లు వచ్చేసినంత మాత్రాన వెంటనే పెళ్లి చేసుకోవాలన్న తొందరేమీ లేదన్నాుడ.

ఓ బంధంలో ఉన్న ఇద్దరికీ.. ఆ బంధాన్ని పెళ్లి వైపు తీసుకెళ్లాలని అనిపిస్తేనే అది జరుగుతుందన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’లో కలిసి నటిస్తుండటంతో ఆలియా ఎంతటి ప్రతిభావంతురాలో తనకిప్పుడు అర్థమవుతోందని.. ఆమెతో నటిస్తుంటే తనకు కొత్త శక్తి వస్తోందని.. తెరమీద తమది గొప్ప జోడీ అవుతుందని భావిస్తున్నానని రణబీర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు