ఆ ప్ర‌యోగంతో పూరీ స‌క్సెస్ అవుతాడా?

ఆ ప్ర‌యోగంతో పూరీ స‌క్సెస్ అవుతాడా?

పూరి జ‌గ‌న్నాథ్....టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు. ఇంకా చెప్పాలంటే అనుకున్న టైంకి ముందే సినిమా రిలీజ్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు. పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన పూరీ....కొంత‌కాలంగా క‌ళ త‌ప్పాడు. రోగ్, లోఫ‌ర్, పైసా వ‌సూల్ అంటూ తీసిన మూస క‌థ‌ల‌నే మార్చి మార్చి తీస్తూ ......జ‌నాల‌కు బోర్ కొట్టించాడు.

ఇక లాభం లేద‌నుకొని త‌న కొడుకు పూరీ ఆకాశ్ తో ప్రేమ‌క‌థ‌ని ప్ర‌యోగించాడు. కానీ, రిజ‌ల్ట్ లో పెద్ద తేడా లేదు. తండ్రీకొడుకులిద్దరికీ ఆ సినిమా చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. అయినా స‌రే ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా పూరీ...ఆకాష్ తోనే మ‌రో సినిమాకు రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా పూరీ...అంతా కొత్త‌వాళ్ల‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌స్తోంది.

మెహబూబా  డిజాస్ట‌ర్ తర్వాత ఆకాష్ పూరితో సినిమా వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు.  అది క్యాన్సిల్ కావ‌డంతో 'రోగ్' హీరో ఇషాన్ తో కలిసి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ తో పూరి సెట్స్ పైకి వెళ్తాడని అనుకున్నారు. అయితే, ఈ సారి పూరీ త‌న ఫార్ములా మార్చాల‌నుకుంటున్నాడ‌ట‌. కొత్తవారందరితో కలిసి ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట‌. అంతేకాదు, సపోర్టింగ్ రోల్, నెగెటివ్ రోల్, లీడ్ రోల్.. ఇలా కాస్టింగ్ కోసం పూరి కనెక్ట్స్ నుంచి కొత్తవాళ్లకు ఆహ్వాన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కాస్టింగ్ కాల్ కంప్లీట్ కాగానే తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్ర‌క‌టిస్తాడ‌ట‌.

అయితే, ఈ సినిమాకు నిర్మాత ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే మెహ‌బూబాతో చేతులు కాల్చుకున్న పూరీ...మ‌రోసారి చేతులు కాల్చుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రి, పూరీని నమ్మి ఇన్వెస్ట్ చేసే నిర్మాత ఎవ‌రో తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు