'ఫిదా' బాటలో 'గీత గోవిందం'

'ఫిదా' బాటలో 'గీత గోవిందం'

పోయినేడాది ‘ఫిదా’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్‌తో పోలిస్తే వచ్చిన వసూళ్లు అనూహ్యం. కొన్ని వారాల పాటు మంచి వసూళ్లతో సాగిన ఈ చిత్రం 45 కోట్ల దాకా షేర్ సాధించిన సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో మామూలుగా ఆడలేదు.

ఏకంగా రూ.18 కోట్ల షేర్ సాధించి పెద్ద స్టార్ల సినిమాల సరసన నిలిచింది. ఈ రేంజ్ మూవీ నైజాంలో ఆ స్థాయి వసూళ్లు సాధించడం అనూహ్యం. విశేషం ఏంటంటే.. ఈ చిత్ర మొత్తం థియేట్రికల్ హక్కులు రూ.16 కోట్లకు అమ్ముడైతే ఒక్క నైజాంలోనే అంత కంటే ఎక్కువ షేర్ వచ్చింది. ఇప్పుడు ‘గీత గోవిందం’ కూడా అదే ఫీట్‌ సాధించేలా కనిపిస్తోంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు రూ.16-17 కోట్ల మధ్య అమ్ముడయ్యాయి.

ఐతే బయ్యర్ల పెట్టుబడి రెండు రోజుల్లోనే వెనక్కి వచ్చేయడం విశేషం. వీకెండ్ అయ్యేసరికి పెట్టుబడిపై రెట్టింపు వసూలైంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.43 కోట్ల దాకా షేర్ రాబట్టింది. రూ.50 కోట్ల మార్కును అందుకోవడం కూడా లాంఛనంగానే కనిపిస్తోంది. విశేషం ఏంటంటే ఇప్పటిదాకా నైజాం ఏరియా వరకే ఈ చిత్రం రూ.12.5 కోట్ల షేర్ సాధించింది. ఈ వీకెండ్లో కూడా సినిమా దుమ్ము దులిపేలా కనిపిస్తోంది. దీని థియేట్రికల్ హక్కుల మొత్తాన్ని నైజాం ఏరియాలోనే దాటేసేలా కనిపిస్తోంది. ఈ రేంజ్ మూవీ రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకోవడమే అనూహ్యం.

ముందే పాజిటివ్ బజ్‌తో రిలీజైన ఈ చిత్రానికి చాలా మంచి టాక్ రావడం కలిసొచ్చింది. అలాగే పోటీలో మరే సినిమా లేకపోవడంతో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ వారం నాలుగు సినిమాలొస్తున్నా ‘గీత గోవిందం’ జోరును అడ్డుకోవడం డౌటే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు