ఆది చెబుతున్న హీరో అఖిలేనా?

ఆది చెబుతున్న హీరో అఖిలేనా?

సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసత్వాన్నందుకుని సినిమాల్లో అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి. ఐతే తండ్రి బాటలో డైరెక్షన్ వైపు అడుగులేయకుండా నటనలోకి వచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. తర్వాత బాగానే నిలదొక్కుకున్నాడు. ఐతే ఆది అన్నయ్య సత్యప్రభాస్ పినిశెట్టి మాత్రం తండ్రి బాటలో డైరెక్షన్ వైపు అడుగులేశాడు. తమ్ముడినే హీరోగా పెట్టి ‘మలుపు’ అనే సినిమా తీశాడు. అది మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే సత్యప్రభాస్ తన రెండో సినిమా చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు. అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా చేయడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. అది ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యే దశలో ఆగింది. ‘హలో’ తర్వాత ఈ చిత్రమే అనుకున్నప్పటికీ.. అఖిల్ తర్వాత నిర్ణయం మార్చుకుని ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమాను పట్టాలెక్కించాడు.

దీని తర్వాత మాత్రం సత్య ప్రభాస్‌తోనే అఖిల్ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఆది పినిశెట్టి కూడా సంకేతాలిచ్చాడు. తన అన్నయ్య రెండో సినిమా తనతో ఉండదని చెప్పాడు. ఒక తెలుగు యంగ్ హీరోతో తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రం చేయడానికి సత్యప్రభాస్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిపాడు. అఖిల్ హీరోగా కరణ్ జోహార్ భాగస్వామ్యంలో తెలుగు, హిందీ భాషల్లో అక్కినేని నాగార్జున సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బహుశా అది సత్యప్రభాస్ దర్శకత్వంలోనే అయి ఉండొచ్చేమో. ఆది కూడా దాని గురించే సంకేతాలిస్తున్నాడేమో. మరోవైపు ‘నీవెవరో’ తర్వాత తాను సోలో హీరోగా హేమంత్ అనే కొత్త దర్శకుడితో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు తెలిపాడు ఆది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో తాను బైకర్ రేసర్‌గా కనిపిస్తానన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు