ముద్దుల సినిమా ధీమా చూడండి

ముద్దుల సినిమా ధీమా చూడండి

రెండేళ్ల కిందట ‘మిణుగురులు’ అనే అవార్డు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. ఆ చిత్రం మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సినిమా తీసిన దర్శకుడి నుంచి ‘24 కిసెస్’ లాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. టైటిల్లోనే కాదు.. ఈ చిత్ర ప్రోమోల్లోనూ ముద్దులే హైలైట్ అయ్యాయి. టీజర్లో ముద్దుల మోత మోగించేశారు హీరో అదిత్ అరుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్. ఈ మధ్య ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఇలాగే ముద్దులు, ఇంటిమేట్ సీన్లతో జనాల దృష్టిని ఆకర్షించింది. మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకుంది. ఈ కోవలోనే ‘24 కిసెస్’ కూడా కుర్రకారును థియేటర్లకు రప్పిస్తుందని ధీమాగా ఉన్నట్లున్నాడు దర్శక నిర్మాతలు. అందుకుే ఈ చిత్రాన్ని గట్టి పోటీ మధ్య వినాయక చవితి వీకెండ్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు.

సెప్టెంబరు 13న ఆల్రెడీ ‘యు టర్న్’.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు వస్తుందంటున్నారు. అయినప్పటికీ వాటికి పోటీగా ‘24 కిసెస్’ రిలీజ్ చేయాలని డిసైడవడం విశేషం. ధైర్యంగా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. దీంతో పాటుగా ట్రైలర్ కూడా వదిలారు. టీజర్‌తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఇందులోనూ ముద్దులకు ఢోకా ఏమీ లేదు. అయితే దాంతో పాటుగా సినిమా కథను కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ప్లేబాయ్ లాంటి కుర్రాడు.. అమాయకురాలైన అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెతో ఆడుకోవాలని చూస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఈ కథ. కొంచెం విషయం ఉన్న కథలాగే ఉంది ట్రైలర్ చూస్తుంటే. రావు రమేష్ ట్రైలర్లో బాగా హైలైట్ అయ్యాడు. విజువల్స్ అన్నీ బాగున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు