చిరంజీవి సీట్లోకి అల్లరి నరేష్

చిరంజీవి సీట్లోకి అల్లరి నరేష్

మెగాస్టార్ చిరంజీవి-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అందరివాడు’ సినిమాలో మేజర్ హైలైట్ కామెడీనే. అందులోనూ చిరంజీవి-సునీల్ కాంబినేషన్లో వచ్చే ఒక సీన్ భలేగా పేలింది. తన ఆట కట్టించడం కోసం కోడలైన హీరోయిన్ సునీ‌ల్‌ను రంగంలోకి దించితే.. అతడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు గోవిందరాజు. ఆ సందర్భంలో వచ్చే సీన్ మోటార్ సైకిల్ సీన్ నవ్వుల విందు పంచింది. చిరు మెరుపు వేగంతో బుల్లెట్ నడుపుతుంటే సునీల్ దాని వెనుక పట్టుకుని వేలాడుతూ వెళ్తాడు. ఆ సీన్ అంత సులువుగా మరిచిపోలేం. ఐతే ఇప్పుడు సునీల్.. అల్లరి నరేష్‌తో కలిసి నటిస్తున్న ‘సిల్లీ ఫెలోస్’ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అందరికీ ఆ సన్నివేశమే గుర్తుకొస్తోంది.

ఇందులో డ్రైవర్ సీట్లో అల్లరి నరేష్ ఉండగా.. వెనుక బైక్ పట్టుకుని సునీల్ వేలాడుతున్నాడు. మరి ‘అందరివాడు’ సినిమాలోని సన్నివేశానికి పేరడీగా ఇది చేశారా.. యాదృచ్ఛికంగా ఇలా జరిగిందా అన్నది తెలియదు. నిజానికి ఇప్పటి ప్రేక్షకులు ఆ తరహా లౌడ్ కామెడీని ఇష్టపడట్లేదు. సటిట్ ఫన్‌ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ‘సిల్లీ ఫెలోస్’ ప్రోమోలు చూస్తుంటే మాత్రం ఇదేమంత కొత్తగా అనిపించట్లేదు. ఇటు సునీల్, అటు అల్లరి నరేష్ హిట్ రుచి చూసి చాలా ఏళ్లయిపోయింది. హీరోలుగా వాళ్ల కెరీర్లు దారుణమైన స్థితికి చేరుకున్నాయి. ఓ మోస్తరు విజయానికి కూడా వీళ్లిద్దరూ ముఖం వాచిపోయి ఉన్నారు. మరి వారి కోరికను ‘సిల్లీ ఫెలోస్’ అయినా తీరుస్తుందో లేదో చూడాలి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English