సాయిపల్లవితో మళ్లీ నటిస్తాడట

సాయిపల్లవితో మళ్లీ నటిస్తాడట

షూటింగ్ సమయాల్లో యూనిట్ సభ్యుల మధ్య ఏవో తేడాలు రావడం సహజం. అలాంటి విషయాలు అప్పటికప్పుడు సమసిపోతుంటాయి. విభేదాలు కొనసాగినప్పటికీ.. ఆ విషయాల్ని మీడియా ముందు ఓపెన్‌గా చెప్పరు. ఎవరైనా ఆ విషయాలపై అడిగినా.. అదేం లేదని కొట్టి పారేస్తారు.

కానీ యువ కథానాయకుడు నాగశౌర్య మాత్రం ‘కణం’ సినిమాలో తనకు జోడీగా నటించిన సాయిపల్లవి గురించి ఒక ఇంటర్వ్యూలో నెగెటివ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. ఆమెకు ఇగో ఎక్కువ అని.. తన ప్రవర్తనతో బాగా ఇరిటేట్ చేసిందని అతను అన్నాడు. దీని గురించి మరోసారి మీడియాను కలిసినపుడు అడిగినా కూడా నెగెటివ్‌గానే మాట్లాడాడు.

సాయిపల్లవితో విభేదాల వల్లే ‘కణం’ ప్రమోషన్లకు కూడా అతను రాలేదు. ఆ సినిమాను పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ సాయిపల్లవి మాత్రం శౌర్య గురించి పాజిటివ్‌గానే మాట్లాడింది. అతడిని హర్ట్ చేసి ఉంటే సారీ అని కూడా అంది.

ఈ మాటలతో కరిగిపోయాడో ఏమో.. నాగశౌర్య ఇప్పుడు సాయిపల్లవి గురించి సానుకూలంగా స్పందించాడు. ఆమెతో మరోసారి నటించడానికి తాను రెడీ అన్నాడు. సరైన స్క్రిప్టు వస్తే సాయిపల్లవితో కలిసి నటిస్తానని అతనన్నాడు. ఐతే ఇప్పుడు కూడా సాయిపల్లవి విషయంలో ఇంతకుముందు అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు శౌర్య చెప్పడం గమనార్హం. మరి ఈ విషయంలో సాయిపల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.

‘కణం’ హిట్టయితే అయినా మళ్లీ వీళ్లిద్దరితో సినిమా చేయడానికి ముందుకొచ్చేవారేమో కానీ.. అది పెద్ద డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇంకోసారి వీళ్లను కలపడానికి ఎవరూ ట్రై చేయకపోవచ్చేమో. శౌర్య త్వరలోనే ‘నర్తనశాల’తో పలకరించబోతుండగా.. సాయిపల్లవి తెలుగులో ‘పడి పడి లేచె మనసు’తో పాటు తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన ‘ఎన్జీకే’ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు