దేవరకొండ.. ఈ ఏడాది ఇంకో రెండు

దేవరకొండ.. ఈ ఏడాది ఇంకో రెండు

‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఏడాది పాటు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏదీ విడుదల కాలేదు. కమిట్మెంట్లయితే చాలానే ఉన్నాయి కానీ.. వాటి నుంచి వెంటనే ఏ సినిమానూ రిలీజ్ చేయలేకపోయాడు విజయ్. మధ్యలో ‘ఏ మంత్రం వేసావె’ అంటూ విజయ్ నటించిన పాత సినిమా ఒకటి వదిలారు దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు.

తర్వాత మే నెలలో ‘ట్యాక్సీవాలా’ రావాల్సింది కానీ.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. చివరికి ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన ఆగస్టు నెలలోనే ‘గీత గోవిందం’ వచ్చింది. మంచి అంచనాల మధ్య రిలీజై.. ఆ అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్లిపోయింది. రూ.50 కోట్ల షేర్ మార్కు దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇక విజయ్ తర్వాతి సినిమా ఎప్పుడొస్తుంది.. ఎలా ఆడుతుంది అని అతడి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశేషం ఏంటంటే.. ఈ ఏడాదిలోనే విజయ్ నటించిన ఇంకో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్ల వాయిదా పడ్డ ‘ట్యాక్సీవాలా’ను నవంబరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదొక ప్రయోగాత్మక చిత్రం. చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. అది వచ్చిన నెలా నెలన్నరకే విజయ్ మరో సినిమా కూడా రిలీజైపోతుందట. అదే.. నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. విక్రమ్‌తో ‘ఇంకొక్కడు’ తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

స్టూడియో గ్రీన్ సంస్థ పెద్ద బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారట. తమిళంలో ఆ పండక్కి ఇంకా ఏ పెద్ద సినిమా షెడ్యూల్ కాలేదు. తెలుుగలో మాత్రం వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’.. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ రాబోతున్నాయి. వాటికి ‘నోటా’తో ఇబ్బంది తప్పదు. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఏడాది గ్యాప్ రాగా.. ఇప్పుడు మాత్రం నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలతో రచ్చ చేయబోతున్నాడన్నమాట విజయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు