మొద‌ట గీతాగోవిందం వ‌ద్ద‌నుకున్నాడ‌ట‌!

మొద‌ట గీతాగోవిందం వ‌ద్ద‌నుకున్నాడ‌ట‌!

టాలీవుడ్ లో తాజా సంచ‌ల‌నం గీతాగోవిందం. కాస్త అటూ ఇటుగా రూ.10కోట్ల‌తో తీసిన‌ట్లు చెబుతున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ. న‌ల‌భైకోట్ల వ‌ర‌కూ వ్యాపారం సాగింద‌ని.. ఈజీగా యాభై దాటేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రో వారం వ‌ర‌కూ స‌రైన చిత్రాలు లేని నేప‌థ్యంలో గీతాగోవిందం దుమ్ము దులుపుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఒక సినిమాను అదే ప‌నిగా రిపీట్ గా చూడ‌టం లేద‌ని.. ఈ సినిమా అందుకు మిన‌హాయింపుగా చెబుతున్న వాళ్లు లేక‌పోలేదు.

ఈ కార‌ణంతోనే సినిమా వ‌సూళ్లు అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. మౌత్ టాక్ తో మ‌రింత స్ప్రెడ్ అవుతోంది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స‌రికొత్త ఇమేజ్ సొంతం కావ‌ట‌మే కాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో కొంద‌రిలో ఉన్న బ్యాడ్ కూడా ఈ సినిమా పుణ్య‌మా అని గుడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను తాను మొద‌ట ఒప్పుకోకూడ‌ద‌ని అనుకున్న‌ట్లుగా విజ‌య్ వెల్ల‌డించాడు. గీతా గోవిందం స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అత‌గాడు.. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పాడు.

త‌న‌కు తొలుత గీతాగోవిందం ప్ర‌పోజ‌ల్ తెచ్చిన‌ప్పుడు ఈ సినిమాకు తాను ఓకే చెప్ప‌కూడ‌ద‌ని అనుకున్నాన‌ని చెప్పాడు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని.. ఇలాంటి జోన‌ర్ లు త‌న‌కు అంత‌గా న‌ప్ప‌వ‌ని అనుకున్నాన‌ని.. అందుకే నో చెప్పాల‌నుకున్న‌ట్లు చెప్పారు. అయితే.. పెద్ద‌నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన గీతా ఆర్ట్స్ కావ‌టం ఒక‌టైతే.. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ త‌న మీద‌న‌మ్మ‌కంతో ఈ సినిమా క‌థ‌ను ఒక‌టికి రెండు సార్లు చెప్ప‌టంతో ఈ సినిమా న‌చ్చింద‌న్నాడు.

క‌థ‌ను అదే ప‌నిగా చెబుతున్న కొద్దీ న‌చ్చింద‌ని.. దాంతో సినిమాకు సంత‌కం చేసిన‌ట్లు చెప్పాడు. ఇప్పుడు త‌న సినిమాకు వ‌స్తున్న స్పంద‌న చూశాక‌.. త‌న‌ను ఒప్పించి ఈ సినిమా చేయించినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. టైం బాగున్న‌ప్పుడు ఎంత చెడిపోదామ‌నుకుండా చెడిపోవ‌టం త‌ర్వాత‌.. అదే ప‌నిగా మేలు జ‌రుగుతుంద‌ని చెబుతారు. దీనికి  విజ‌య్ నిలువెత్తు నిద‌ర్శ‌నం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు