విరాళంతోపాటు సేవ చేయ‌బోతున్న త‌మిళ హీరో!

విరాళంతోపాటు సేవ చేయ‌బోతున్న త‌మిళ హీరో!

గ‌త 100 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా వ‌ర‌దలు ముంచెత్త‌డంతో కేర‌ళ అత‌లాకుతల‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో, కేర‌ళ‌ను ఆదుకునేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు ముందుకు వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి ప‌లువురు.....కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ఇచ్చి త‌మ పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. అదే త‌ర‌హాలో తాజాగా, కోలీవుడ్ హీరో, ద‌ర్శ‌కుడు లారెన్స్ రాఘ‌వ‌....కేర‌ళ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం రూ.కోటి విరాళాన్ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా, స్వ‌యంగా కేర‌ళ వెళ్లి అక్క‌డ జ‌రుగుతున్న స‌హాయ‌కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకోవాల‌ని లారెన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

సమాజ సేవలో లారెన్స్ ముందుంటాడ‌న్న సంగతి తెలిసిందే. అదే త‌ర‌హాలో తాజాగా కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు విరాళం అందించ‌డంతో పాటు స్వ‌యంగా స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని లారెన్స్ నిర్ణ‌యించుకున్నాడు. ఇదే విష‌యాన్ని లారెన్స్ ట్వీట్ చేశాడు. వ‌ర‌ద‌ల కార‌ణంగా కేరళలో ఉన్న మ‌న‌ సోదర సోదరీమణుల వంటి ప్రజలు ఇబ్బందులు ప‌డ‌డం త‌న‌ను కలచివేసిందని అన్నాడు. తానే స్వ‌యంగా వ‌ర‌ద ముంపు  ప్రాంతాల‌కు వెళ్లాల‌ని అనుకున్నాన‌ని, కానీ అక్క‌డకు చేరుకోవ‌డం కష్టమని అక్కడి అధికారులు వారించడంతో ఆగిపోయాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం వ‌ర్షాలు తగ్గుముఖం పట్ట‌డంతో అక్క‌డ సేవ చేసేందుకు ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నానని లారెన్స్ అన్నారు. ఈ శనివారం నాడు కేరళ సీఎంను కలిసి, వ‌ర‌ద బీభ‌త్సం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల వివ‌రాలు అడిగి తెలుసుకుని సేవ చేసేందుకు అవకాశం కల్పించమని కోరబోతున్నానని చెప్పారు. అంద‌రి హీరోల్లాగా విరాళాలు ఇవ్వ‌డంతో పాటు స్వ‌యంగా సేవ చేయాల‌నుకుంటోన్న లారెన్స్ పై నెటిజన్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు