బిగ్ బాస్ విన్న‌ర్ పై రష్మి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ విన్న‌ర్ పై రష్మి షాకింగ్ కామెంట్స్!

గ‌త ఏడాది తెలుగులో ప్రారంభ‌మైన బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. హోస్ట్ గా ఎన్టీఆర్, హౌజ్ మేట్స్ ...అంతా క‌లిసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అదే ఊపుతో ఈ ఏడాది నాని హోస్ట్ గా ప్రారంభ‌మైన బిగ్ బాస్-2 ఆరంభంలో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే, క్ర‌మ‌క్ర‌మంగా షోలో ట్విస్టులు.....నాని చెప్పిన‌ట్టుగానే ఊహించ‌ని మలుపులు....ఉండ‌డంతో ప్ర‌స్తుతం షోకు మంచి టీఆర్పీలే వ‌స్తున్నాయి. గ‌త ఏడాది షోలో శివ‌బాలాజీ ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తుండ‌డంతో....విన్న‌ర్ అయ్యాడ‌ని సోష‌ల్ మీడియాలో రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే, ఈ సారి షోలో కౌశ‌ల్ కు ఏకంగా సోష‌ల్ మీడియాలో ఓ ఫ్యాన్స్ ఆర్మీనే త‌యారైంది. దానికి త‌గ్గ‌ట్లుగానే కౌశ‌ల్ తో గొడ‌వ పెట్టుకున్న హౌజ్ మేట్స్ దాదాపుగా ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో, ఈ సారి బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ అని కౌశ‌ల్ ఆర్మీ ఫిక్స్ అయిపోయింది. ఈ నేప‌థ్యంతో తాజాగా బిగ్ బాస్ -2 విన్న‌ర్ పై జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్, హీరోయిన్ ర‌ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్-2 విన్నర్ కౌశలేనని..ఒక‌వేళ వేరెవ‌రైనా విన్ అయితే ధర్నాలు జరుగుతాయని ర‌ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను బిగ్‌బాస్ చూడన‌ని, కానీ, నందినీరాయ్, కౌశల్, గీతలతో త‌న‌కు సాన్నిహిత్యం ఉంద‌ని, అందువ‌ల్ల సోష‌ల్ మీడియాలో వారి అప్ డేట్స్ త‌న‌కు వ‌స్తుంటాయ‌ని తెలిపింది. కౌశల్ ఆర్మీ అప్ డేట్స్  ట్విటర్ లో చూస్తుంటాన‌ని, ఇప్ప‌టివ‌ర‌కు కౌశ‌ల్ కు పాపులారిటీ వన్ సైడెడ్ గా వ‌స్తోంద‌ని, దాదాపుగా కౌశలే విన్ అవుతాడని అనిపిస్తోందని ర‌ష్మి అభిప్రాయ‌ప‌డింది. కౌశల్ ఆర్మీ చాలా చాలా స్ట్రాంగ్ అని, చాలా ఫీడ్స్, పోస్ట్స్, వీడియోస్ చేసి ....కౌశ‌ల్ కు మంచి స‌పోర్ట్ ఇస్తున్నార‌ని తెలిపింది. ఒక వేళ కౌశ‌ల్  గెలవకుంటే ధర్నాలు అయిపోతాయంటూ రష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మ‌రి, ర‌ష్మి చెప్పిన బిగ్ బాస్ జోస్యం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో వేచిచూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English