అప్పుడు తమిళ్ ..ఇప్పుడు మలయాళం

అప్పుడు తమిళ్ ..ఇప్పుడు మలయాళం

ఆర్య-నయనతార జంటగా నటించిన 'రాజురాణి' మూవీలో నయన్ ఫ్రెండ్ గా  నివేదా పాత్రలో కనిపించిన  క్యూట్ బ్యూటీ గుర్తుందా? అదేనండీ.. ధన్యబాలకృష్ణ . అమ్మడు తమిళ పొణ్ణు అయినప్పటికీ, 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, రన్ రాజా రన్, నేను శైలజ, రాజు గారి గది, జయ జానకీ నాయక'  లాంటి  సినిమాలతో పాటు ఇటీవల 'పిల్ల' అనే వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో మంచి మార్కులు కొట్టేసింది. అలాగే తన మదర్ టంగ్ తమిళంలోనూ ఎన్నో ప్రధాన పాత్రలు పోషించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మేటర్లోకొస్తే.. ఇప్పుడీ సుందరి.. మాలీవుడ్ మీద కూడా కన్నేసిందని వార్తలొస్తున్నాయి. నివీన్ పాలీ, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ మళ్లీ నయనతార ఫ్రెండ్ గా నటించబోతోందట.

మలయాళ యంగ్ హీరో, ధ్యాన్ శ్రీనివాసన్ డైరెక్షన్ లో 'లవ్ యాక్షన్ డ్రామా' అనే టైటిల్ తో తెరకెక్కనుంది ఈ సినిమా. నివిన్ పాలీ సరసన నయనతార తొలిసారిగా కథానాయికగా నటించనుండడం విశేషం. 'రాజురాణి' తర్వాత రెండోసారి నయనతార ఫ్రెండ్ గా నటించనున్న ధన్య.. ఈ సినిమా మీద మంచి హోప్ప్ పెట్టుకుంది. ఈ మూవీతో మరిన్ని మలయాళ చిత్రాల్లో అవకాశాలు అందుకోవాలనుకుంటోంది. మరి అమ్మడు తమిళ, తెలుగు చిత్రాల మాదిరిగానే మలయాళంలో మంచి పేరు తెచ్చుకుంటుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు