ఉరి కి ,చిరు కి పాజిటివ్ సెంటిమెంట్..?

ఉరి కి ,చిరు కి పాజిటివ్ సెంటిమెంట్..?

కొన్ని సెంటిమెంట్లు కొందరు హీరోలకు భలేగా సెట్ అవుతాయి. అలాంటి ఓ పాజిటివ్ సెంటిమెంట్ ఇప్పుడు మెగాస్టార్ 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి అన్వయించుకుంటూ అభిమానులు తెగ ఆనందించేస్తున్నారు. అదేంటంటే.. చిరు సినిమాల్లో ఆయనకు ఉరి వేసే సన్నివేశాలుంటే ఆ సినిమా సూపర్ హిట్టయిపోయినట్టే .

గతంలో 'అభిలాష, ఖైదీ, రక్తసిందూరం, ఠాగూర్' చిత్రాల్లో చిరంజీవి పాత్రకు ఉరి శిక్ష విధిప్తారు. ఆ సినిమాలు ఎంతటి సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక త్వరలో రానున్న చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో  చిరంజీవి కి చివరిలో ఉరిశిక్ష విధించే సన్నివేశమే అందరికీ పునకాలు తెప్పిస్తుందని చెప్పుకుంటున్నారు.

అయితే ఇక్కడో చిన్నమెలిక ఏంటంటే.. గత చిత్రాల్లో చిరంజీవికి ఉరిశిక్ష విధించినా.. అందులో ఆయనకి శిక్ష అమలు కాదు. కానీ 'సైరా' చిత్రంలో అలాకాదు.  మన దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఉరికొయ్యను ముద్దాడే ధీరోదాత్తమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది.

 గత చిత్రాల పాజిటివ్ సెంటిమెంట్ ఈ సినిమాకీ అప్లై అయినప్పటికీ చిరంజీవి పాత్ర చనిపోతే ఆయన అభిమానులు ఎంత వరుకూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారనే సందేహం అయితే లేకపోలేదు. మరి ఆ  పాజిటివ్ సెంటిమెంట్ లోని నెగటివిటీని జయిస్తే.. సైరా నరసింహారెడ్డి కూడా సూపర్ హిట్టు అయిపోయినట్టే. చూద్దాం ఆ సెంటిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో ...


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు