మన డిజైనర్లు కోలీవుడ్లోకి అడుగుపెట్టారే

మన డిజైనర్లు కోలీవుడ్లోకి అడుగుపెట్టారే

అనిల్-భాను.. టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ పేరు ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పబ్లిసిటీ డిజైనింగ్‌లో ఇప్పుడు వీళ్లను మించిన వాళ్లు ఎవరూ లేరు టాలీవుడ్లో. ఎన్నో క్రియేటివ్ పోస్టర్లతో వీళ్లు తమదైన ముద్ర వేశారు. ‘బొమ్మరిల్లు’ మొదలుకుని.. ‘గోపాల గోపాల’.. ‘కంచె’.. ‘మనం’.. ‘క్షణం’.. ‘సరైనోడు’.. ‘ప్రేమమ్’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ఇలా ఎన్నో భారీ సినిమాలకు ఆకర్షణీయమైన పోస్టర్ డిజైన్లతో మెప్పించింది ఈ జోడీ. ఇప్పుడీ జంట డిజైనర్లు కోలీవుడ్లోనూ అడుగు పెట్టారు.

కోలీవుడ్ సూపర్ల స్టార్లలో ఒకడైన అజిత్ కొత్త సినిమా ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్ ఈ రోజే లాంచ్ కాగా.. దాన్ని డిజైన్ చేసింది అనిల్-భానులే. ఈ పోస్టర్ అజిత్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అజిత్ శైలికి తగ్గట్లుగా మాస్ కళ ఉట్టిపడుతోంది ఈ పోస్టర్లో.

ఐతే తెలుగులో మాత్రం క్రియేటివ్‌గా ఏమీ చేయడానికి అనిల్-భానులకు దర్శకుడు శివ ఛాన్స్ ఇచ్చినట్లు లేడు. అజిత్-శివ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘వివేగం’ ఫస్ట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. అందులో చూపించిన అజిత్ సిక్స్ ప్యాక్ లుక్ ఫేక్ అంటూ యాంటీ ఫ్యాన్స్ చెలరేగిపోయారు. ఈ విషయంలో డిఫెండ్ చేసుకోవడానికి చిత్ర బృందం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి వివాదాలకు తావు లేకుండా పోస్టర్ సింపుల్‌గానే కానిచ్చేశారు. కథ విషయంలోనూ ఈసారి కొత్తగా ఏమీ ట్రై చేసినట్లు లేదు. మామూలు మాస్ సినిమాలాగే అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే. ఐతే అజిత్ మాస్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. శివ చివరి మూడు సినిమాలూ అజిత్‌తోనే తీయడం విశేషం. అందులో ‘వీరం’.. ‘వేదాలం’ బాగా ఆడాయి. ‘వివేగం’ ఫ్లాప్ అయింది. మరి ‘విశ్వాసం’ ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు