'సైరా' 50 శాతం ఫినిష్.. వేసవిలో రిలీజ్

'సైరా' 50 శాతం ఫినిష్.. వేసవిలో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ గత ఏడాదే మొదలైంది. చిన్న చిన్న విరామాలు మినహాయిస్తే.. మరీ పెద్ద గ్యాప్ ఏమీ తీసుకోకుండా షూటింగ్ చేస్తూ సాగుతోంది చిత్ర బృందం. ఐతే ఇప్పటిదాకా సరిగ్గా ఎంత శాతం షూటింగ్ అయ్యింది.. ఎప్పటికి సినిమా పూర్తవుతుంది అనే విషయాల్లో స్పష్టత లేదు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికే ప్రేక్షకుల ముందుకొస్తుందా లేదా అన్న విషయంలోనూ సందిగ్ధత ఉంది. ఐతే ఈ చిత్ర నిర్మాత రామ్ చరన్ ఈ విషయాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మంగళవారం రాత్రి మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈ విశేషాల్ని అభిమానులతో పంచుకున్నాడు చరణ్.

ఇప్పటిదాకా 'సైరా' షూటింగ్ 50 శాతం పూర్తయిందని చరణ్ తెలిపాడు. విడుదలకు ఇంకా 8-10 నెలల సమయం ఉందని.. ఈలోపు మిగతా పనంతా పూర్తి చేస్తామని అన్నాడు. సరిగ్గా రిలీజ్ టైం చెప్పలేం కానీ.. వేసవిలోనే రిలీజ్ చేద్దామన్న ప్రణాళికతో ఉన్నట్లు అతను వెల్లడించాడు. సినిమా చాలా బాగా వస్తోందని.. టీజర్ చూశాక అభిమానుల్లో కలిగిన అంచనాల్ని అందుకునేలాగే సినిమా ఉంటుందని చరణ్ తెలిపాడు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి తాము మరింత కష్టపడి పని చేస్తామని అతనన్నాడు. ‘సైరా’కు సంగీత దర్శకుడిగా బాలీవుడ్ నుంచి అమిత్ త్రివేదిని తీసుకురావడంపై అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారని.. తెలుగు నేటివిటీకి తగ్గ మ్యూజిక్ ఇవ్వగలరా అని సందేహించారని.. కానీ టీజర్లో ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని.. దాని కోసమే మళ్లీ మళ్లీ టీజర్ చూస్తున్నారని చరణ్ అన్నాడు. అమిత్ మొత్తం సినిమాకు కూడా ఇలాంటి ఔట్ పుటే ఇస్తాడని చరణ్ ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English