క్రిష్‌ పరువు తీసినట్టేగా!

క్రిష్‌ పరువు తీసినట్టేగా!

'ఝాన్సీ రాణి' జీవిత కథతో కంగనా రనౌత్‌ కథానాయికగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన 'మణికర్నిక' చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. అయినా కానీ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ తీయడం కోసం క్రిష్‌ హైదరాబాద్‌కి వచ్చేసాడు. ప్యాచ్‌వర్క్‌తో పాటు ఇంకా కాస్త బ్యాలెన్స్‌ వర్క్‌ వుంటే దానిని కంగనా రనౌత్‌ తీసేసుకుంటోంది. ఇది సైలెంట్‌గా చేసేసి వుండొచ్చు కానీ ఈ విషయాన్ని మీడియాకి లీక్‌ చేసింది.

నిజానికి ఈ చిత్రానికి క్రిష్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ డైరెక్టర్‌ కాదు. వేరే దర్శకుడితో పేచీ పెట్టుకుని చివరి నిమిషంలో క్రిష్‌ని తీసుకుంది. క్రిష్‌ రబ్బర్‌స్టాంప్‌ అని, కంగనే సినిమా తీసుకుంటోందని రూమర్లు కూడా వినిపించాయి. అయితే క్రిష్‌ అవేమీ పట్టించుకోలేదు. చాలా మంది ఇలాంటి రూమర్లు సహజమేనని ఎక్కువ కేర్‌ చేయలేదు. అయితే ఇప్పుడీ న్యూస్‌ లీకేజీతో క్లియర్‌గా ఈ సినిమా దర్శకత్వంపై తన ముద్ర వుందనేది చాటుకోవడానికి కంగన ప్రయత్నిస్తోన్నట్టు స్పష్టమైంది. అంతే కాకుండా ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా క్రిష్‌ పట్టించుకోవడం లేదు. అదంతా కంగనే చూసుకుంటోంది.

పైగా తాను ఫిలిం డైరెక్షన్‌ కోర్స్‌ చేసానంటూ మీడియాకి ఎక్స్‌ట్రా డోస్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కూడా అందించింది. కంగన తీరు తెలిసిన వారు ఈ చిత్రం విడుదల నాటికి ఆమె ఇంకెన్ని విధాలుగా ఈ చిత్రం తనదేనని చాటుకోవడానికి ట్రై చేస్తుందోనంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు