శైలజారెడ్డి అల్లుడు భయపడ్డాడా?

శైలజారెడ్డి అల్లుడు భయపడ్డాడా?

శైలజారెడ్డి అల్లుడు విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో జాప్యం దీనికి కారణమని చెబుతోన్నా సడన్‌గా కొన్ని సీన్లని రీషూట్‌ చేయాలని డిసైడ్‌ అవడం వలనే వాయిదా పడిందనేది టాలీవుడ్‌ గుసగుస. గీత గోవిందం విడుదల తర్వాత 'శైలజారెడ్డి అల్లుడు' అలర్ట్‌ అయ్యాడని, సినిమాలో వినోదం పాళ్లు బాగా వుండాలని రియలైజ్‌ అయి కొన్ని సన్నివేశాలని తిరిగి తీస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్‌గా వున్న సినిమాలని నిర్దయగా తోసి పారేస్తున్నారు. అదే వినోదం బాగా వుంటే మాత్రం రొటీన్‌ కథ అయినా క్షమించేస్తున్నారు. ఈ ట్రెండుని గుర్తించి, శైలజారెడ్డి అల్లుడు రొటీన్‌ సినిమానే కావడంతో కామెడీ డోసు పెంచుతున్నారు. అయితే ఎంతో కాలం ఆలోచించి రాసుకున్న సీన్లలో పండని వినోదం ఇప్పటికిప్పుడు ఆలోచించి పెట్టిన సీన్లలో ఎంతవరకు పండిందనేది సినిమా చూస్తే కానీ తెలీదు.

ఏదేమైనా సినిమా విడుదల చేసేసి ఆనక తీరిగ్గా చింతించే కంటే ఫలానా రిపేర్లు ముందే జరగాలని రియలైజ్‌ అయి కొన్నాళ్లు వాయిదా వేసుకుని రావడమే ఉత్తమం. అసలే ఇప్పటి రోజుల్లో తిరస్కరించబడ్డ చిత్రాలకి ప్రింట్ల ఖర్చులు రావడం కూడా గగనమైపోతోంది. ట్రెండు స్టడీ చేసేసిన తర్వాత అలర్ట్‌ అవడం దోషమేమీ కాదు. ఈ ఆలస్యంతో అల్లుడి రేంజ్‌ పెరుగుతుందనే మనం కూడా ఆశిద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు