ఇది పవన్‌కళ్యాణ్‌ని మించిన గ్రాఫ్‌

ఇది పవన్‌కళ్యాణ్‌ని మించిన గ్రాఫ్‌

విజయ్‌ దేవరకొండని ఇప్పుడందరూ పవన్‌ కళ్యాణ్‌తో పోలుస్తున్నారు. యువతలో అబ్బురపరిచే ఫాలోయింగ్‌ తెచ్చుకుని, యూత్‌ ఐకాన్‌గా నిలిచిన పవన్‌ తర్వాత మళ్లీ అలా యువతని ప్రభావితం చేసిన హీరో రాలేదు. అర్జున్‌రెడ్డి, గీత గోవిందంతో యూత్‌లో తన ఫాలోయింగ్‌ ఏమిటనేది విజయ్‌ దేవరకొండ చూపించాడు. దీంతో దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ లాంటి వాళ్లు కూడా అతడిని పవన్‌తో పోల్చేస్తున్నారు.

యువత ఆదరణ చూరగొన్న విషయంలో నిజంగానే పవన్‌తో పోల్చవచ్చు కానీ విజయ్‌ సక్సెస్‌ గ్రాఫ్‌ చూసుకుంటే మాత్రం పవన్‌ని మించినదని ఒప్పుకుని తీరాలి. పెళ్లి చూపులు పది కోట్ల వసూళ్లు తెచ్చుకుంటే, అర్జున్‌ రెడ్డి పాతిక కోట్లు రాబట్టింది. గీత గోవిందం అయిదు రోజుల్లోనే ముప్పయ్‌ కోట్లకి పైగా వసూలు చేసి నలభై కోట్ల దిశగా దూసుకుపోతోంది.

పవన్‌కి తొలిప్రేమ నుంచి ఖుషీ వరకు వరుసగా ఘన విజయాలు దక్కాయి కానీ ఇలా ప్రతి సినిమాతోను తన గ్రాఫ్‌ అలా పెరుగుతూ అయితే పోలేదు. పైగా పవన్‌కి చిరంజీవి అభిమానుల అండదండలు మొదట్నుంచే వున్నాయి. కానీ విజయ్‌కి వచ్చిన ఫాలోయింగ్‌ మొత్తం అతడిని చూసి వచ్చిందే తప్ప వారసత్వ అభిమానులెవరూ లేరు కాబట్టి ఇతడి అఛీవ్‌మెంట్‌ని కాస్త ఎక్కువగానే చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు